బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- September 17, 2025
యూఏఈః అబుదాబి బిగ్ టికెట్ సెప్టెంబర్‌లో జరిగిన మొదటి విక్లీ ఇ-డ్రాలో నలుగురు భారతీయులు, ఒక బంగ్లాదేశీ విజేతలుగా నిలిచారు. ప్రతి విజేత 50 వేల దిర్హమ్స్ పొందనున్నారు. విజేతలలో భారతీయులలో ఒకరైన బిజు జోస్ సెప్టెంబర్ 4న ఆన్లైన్లో టికెట్ కొనుగోలు చేశాడు. కేరళకు చెందిన 36 ఏళ్ల అబుదాబిలో పనిచేస్తున్న అభిలాష్ కుంజప్పి పది మంది సహోద్యోగులతో కొనుగోలు చేసిన టికెట్ విజయాన్ని తెచ్చిపెట్టింది.12 సంవత్సరాలుగా అబుదాబిలో నివసిస్తున్న కేరళకు చెందిన 34 ఏళ్ల ఎలక్ట్రీషియన్ జిబిన్ పీటర్ టూ ప్లస్ టూ టికెట్ కొనుగోలుతో వచ్చిన ఉచిత టికెట్ ద్వారా విజయాన్ని దక్కించుకున్నారు. గత 28 సంవత్సరాలుగా దుబాయ్‌లో నివసిస్తున్న బంగ్లాదేశ్ ప్రవాసి 53 ఏళ్ల ప్లాస్టరింగ్ వ్యాపారి మొహమ్మద్ మామునుర్ రెహ్మాన్ నాసర్ ఉల్లా విజేతగా నిలిచాడు.
ఇక అక్టోబర్ 3న లైవ్ డ్రా లో ఒక అదృష్టవంతుడు Dh20 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్‌ను గెలుచుకుంటాడు. దాంతోపాటు నలుగురు కన్సోలేషన్ విజేతలకు ఒక్కొక్కరికి Dh50,000 దక్కనుంది. ఇక వీక్లీ డ్రాలు నెల పొడవునా కొనసాగుతాయి. రతి వారం నలుగురు విజేతలకు Dh50,000 అందజేయనున్నారు. బిగ్ టికెట్ స్టోర్లు సెప్టెంబర్ లో ప్రత్యేక టిక్కెట్ బండిల్ ప్రమోషన్లను నిర్వహిస్తున్నాయి. వీటిలో 2 టిక్కెట్లు కొంటే బిగ్ టికెట్ ఎంట్రీలకు 2 ఉచితంగా లభిస్తాయి. ఇక డ్రీమ్ కార్ ఎంట్రీలకు 2 టిక్కెట్లు కొనుగోలు చేసినవారికి 3 టికెట్లు ఉచితంగా లభించనున్నాయి
తాజా వార్తలు
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్‌లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్‌లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!
- ఆన్లైన్ ట్రావెల్ మోసాలపై ప్రయాణికులకు హెచ్చరిక..!!
- షేక్ ఈసా బ్రిడ్జిపై తాత్కాలికంగా ఒక లేన్ మూసివేత..!!







