వీళ్ల కథలు స్ఫూర్తి మంత్రాలు..మొక్కవోని ధైర్యంతో ‘క్యాన్సర్’ జయించిన వనితలు..!!

- October 22, 2024 , by Maagulf
వీళ్ల కథలు స్ఫూర్తి మంత్రాలు..మొక్కవోని ధైర్యంతో ‘క్యాన్సర్’ జయించిన వనితలు..!!

క్యాన్సర్. ఈ పేరు వినగానే గుండెల్లో గుబులు మొదలవుతుంది. క్యాన్సర్ వచ్చిదంటే ప్రాణాలు పోతాయనే భయం అనాదిగా మన సమాజంలో బలంగా ఉంది. కానీ కాలం మారింది. క్యాన్సర్ కు మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ స్టేజీలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే పూర్తిగా నయం చేసే అవకాశం 100శాతం ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. క్రమం తప్పకుండా వైద్యపరీక్షలు చేయించుకుంటే చాలా వరకు క్యాన్సర్ పై విజయం సాధించవచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం.. ఏటా రెండు కోట్లమంది వివిధ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. అవగాహన లేమి, చివరి స్టేజీలో గుర్తింపు కారణాలతో ఇందులో 40 నుంచి 50 శాతం మంది క్యాన్సర్ బాధితులు నాలుగైదు ఏళ్లలో మరణానికి దగ్గరవుతున్నారు. దీనికి చాలా మంది క్యాన్సర్స్‌ని చివరిదశలోనే గుర్తించడం.. ఆ సమయంలోనే ఈ క్యాన్సర్ వేగంగా అభివృద్ధి చెందడం, దీని వల్ల ట్రీట్‌మెంట్ కష్టంగా మారి మరణాల రేటు పెరుగుతుందన్నది వైద్యుల అభిప్రాయం. వీటన్నింటికి చెక్ పెట్టేందుకు ఎన్నో పరిశోధనలు చేసిన పరిశోధకులు ముందడుగు వేస్తున్నారు. సరికొత్త ట్రీట్‌మెంట్‌‌తో ఈ క్యాన్సర్ మరణాలని చాలా వరకు తగ్గిస్తున్నారు. క్యాన్సర్ ను జయించిన కొంతమంది బాధితులు తమ అనుభవాలను పంచుకునేందుకు ముందు వస్తున్నారు. ఇతరుల్లో క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడంతోపాటు వారిలో స్ఫూర్తికి బాటలు వేస్తున్నారు. సొంత దేశం ఇండియాకు, కుటుంబాలకు దూరంగా యూఏఈ లో ఉంటూ.. విజేతలుగా నిలిచిన అలాంటి కొందరి అభిప్రాయాలను మనం తెలుసుకుందాం.

అవగాహనతోనే 100శాతం విజయం: శ్రీమతి లుబ్నా

32 ఏళ్ల శ్రీమతి లుబ్నా.. 21 ఏళ్ల వయస్సులోనే పెద్ద సమస్యను ఎదుర్కొన్నారు. తరచుగా హెవీ బ్లీడింగ్ కావడం, పెద్ద సైజులో బ్లడ్ స్పాచెస్ పడటంతో వైద్యులను సంప్రదించారు. అల్ట్రా సౌండ్ చేసి యుటెరస్ లో సెంటిమీటర్ వరకు పైబ్రాయిడ్స్ ఉన్నాయని నిర్ధారించారు. ధైర్యం కోల్పోలేదు. చికిత్స చేయించుకుంది. గూగుల్  సెర్చ్ ద్వారా అవగాహన పొందారు. చికిత్స విధానాలను తెలుసుకున్నారు. వైద్యుల సహాయాన్ని పొందారు. హార్మోన్స్ అప్ అండ్ డౌన్ తో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత విజయవంతంగా లేజర్ చికిత్స తీసుకొని పైబ్రాయిడ్స్ సమస్యను జయించారు. తాను ఎదుర్కొన్న ఈ సమస్యపై ఇతరులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి 6 నెలలకు ఒకసారి మహిళలు యటెరస్ టెస్టింగ్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. వ్యాక్సినేషన్, స్క్రీనింగ్ లతో సమస్యలను ఆదిలోనే గుర్తిస్తే.. విజయవంతంగా చికిత్స తీసుకోవచ్చని చెబుతున్నారు. సాధ్యమైనంత వరకు ముగ్గురు నలుగురు డాక్టర్లను కన్సల్ట్ అయి సమస్యపై అభిప్రాయాలను తెలుసుకోవాలంటున్నారు. ఫ్యామిలీపై సమయాన్ని కేటాయించడంతోపాటు తమ ఆరోగ్యానికి కూడా సమయం కేటాయించాలని మహిళలకు సూచిస్తున్నారు. సెల్ఫ్ మోటివేషన్ అనేది ముఖ్యమంటున్న లుబ్నా..పాజివిటి, ఈట్ హెల్దీ, హెల్దీ లైఫ్, స్ట్రెస్ కు దూరంగా ఉండటంతోపాటు మనల్ని మనం గౌరవించువాలని సూచిస్తున్నారు.  

ఏ స్టేజీలోనూ ధైర్యాన్ని కోల్పోలేదు: శ్రీమతి సిరి

అబుదాబిలో ఉంటున్న విజయవాడకు చెందిన శ్రీమతి సిరి(30)..  ఓ రోజు లో బీపీతో తన కార్యాలయంలో పడిపోయింది. వెంటనే సహచరులు సమీపంలోని హాస్పిటల్ లో చేర్పించారు. వివిధ వైద్య పరీక్షలు చేసిన వైద్యులు.. అందులో ప్రాథమికంగా తేడాలు ఉన్నట్లు గుర్తించారు.  ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవాలని రిఫర్ చేశారు. చివరకు తన బ్రెస్ట్ లో క్లాట్స్ ఉన్నట్లు నిర్ధారించారు. కుటుంబానికి దూరంగా దేశం కాని దేశంలో ఒంటరిగా ఉద్యోగం చేసే సిరి ఏమాత్రం కుంగిపోలేదు. ధైర్యాన్ని కోల్పోలేదు. క్యాన్సర్ అంటే అదేదో భూతం అన్నట్లు చూసే సమాజంలో ఉన్న పేరెంట్స్ కు విషయం చెప్పాలనుకోలేదు. తానే సింగిల్ గా ఫైట్ చేయాలని నిర్ణయించుకుంది. చివరకు మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేసింది. ఒంటరిగానే చికిత్స చేయించుకోవాలని డిసైడ్ అయింది. సోనోగ్రఫీ ద్వారా క్లాట్స్ ను గుర్తించిన వైద్యులు.. రెండు రోజులు ఆస్పత్రి చికిత్స అందించారు. క్లాట్స్ ను పూర్తిగా తొలగించారు. ఆ సమయంలో తనకు తెలిసిన కొందరు మహిళలు ఆమెకు ఎమోషనల్ గా సఫోర్టుగా నిలిచారు. తనకు అండగా ఉండి ధైర్యం చెప్పారు. రెండు రోజుల్లోనే కోలుకున్న సిరి.. మూడోరోజు ఉద్యోగ విధులకు హాజరై అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. క్లిష్ట సమయాల్లో ప్రతి మహిళ  స్ట్రాంగ్ ఎమోషనల్ గా ఉండాలని సూచించారు. క్యాన్సర్ అనగానే భయపడవద్దని, ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు.  మెంటల్ స్ట్రెంత్ అనేది ముఖ్యమన్న సిరి.. ధైర్యంతో చికిత్స తీసుకోవాలని, అనంతరం వైద్యుల సూచనలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది సాధారణమని, తరచూ నిర్ధారణ పరీక్షలతో ప్రారంభ స్టేజీలోనే క్యాన్సర్ ను గుర్తిస్తే.. దానిని జయించడం సులువు అవుతుందని తెలిపారు. ఏ సందర్భంలోనూ ధైర్యాన్ని కోల్పోవద్దని, సెల్ఫ్ మోటివేషన్ తో ముందడుగు వేయాలన్నారు.

కాన్సర్ పై పోరాడి విజేతలుగా నిలిచి ప్రతిఒక్కరికి స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ మహిళకు కృతజ్ఞతాభినందనలు తెలుపుతోంది మాగల్ఫ్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com