కువైట్ తీరప్రాంతంలో బార్బెక్యూలు, షిషాలపై నిషేధం..!!

- October 23, 2024 , by Maagulf
కువైట్ తీరప్రాంతంలో బార్బెక్యూలు, షిషాలపై నిషేధం..!!

కువైట్: తీరప్రాంతంలో బార్బెక్యూలు, షిషా ధూమపానాన్ని కువైట్ మునిసిపాలిటీ నిషేధించింది. టూరిజం ప్రాజెక్ట్స్ కంపెనీ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.  ఈ నిషేధం తదుపరి నోటీసు వచ్చే వరకు గ్రీన్ ప్రదేశాలు, కాలిబాటలు, ఇసుక ప్రాంతాలకు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కొత్త ఆంక్షలను అమలు చేయడానికి ప్రభుత్వ సంస్థల సహకారంతో తనిఖీ బృందాలు బీచ్‌లలో గస్తీ తిరుగుతాయని పేర్కొంది. అయితే, అల్-అఖిలా, అల్-ఖిరాన్ బీచ్‌లలో బార్బెక్యూలను అనుమతించిన విషయం తెలిసిందే.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com