సౌదీ అరేబియాలో 200 ఔషధాల ఉత్పత్తి.. అల్-ఖోరాయేఫ్

- October 23, 2024 , by Maagulf
సౌదీ అరేబియాలో 200 ఔషధాల ఉత్పత్తి.. అల్-ఖోరాయేఫ్

రియాద్:  సౌదీ అరేబియాలో స్థానికంగా ఉత్పత్తి చేసేందుకు అనువుగా ఉన్న సుమారు 200 ఔషధాలను గుర్తించినట్టు పరిశ్రమ, ఖనిజ వనరుల మంత్రి బందర్ అల్-ఖోరాయేఫ్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతో సమన్వయంతో 42 ఔషధాలను లోకల్ కంపెనీలలో ఉత్పత్తి చేసే చర్యలు ప్రారంభమైనట్టు పేర్కొన్నారు. సౌదీ అరేబియా ప్రధాన ప్రపంచ ఔషధ కంపెనీలతో కుదుర్చుకున్న భాగస్వామ్య ఒప్పందాల ద్వారా ఈ ప్రాంతంలో ఔషధ, వ్యాక్సిన్ పరిశ్రమకు కీలకమైన కేంద్రంగా మారేందుకు ముందుకు సాగుతున్నదని తెలిపారు.

ఫార్మాస్యూటికల్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడానికి,  ఔషధ రంగంలో సౌదీ అరేబియా విజన్ 2030 లక్ష్యాలను సాధించే దిశగా వివిధ దశలను వేగవంతం చేయడానికి, ఔషధ పరిశ్రమను లోకలైజ్ చేసే ప్రయత్నాలు ముమ్మరంగా సాగతున్నాయని పేర్కొన్నారు. సౌదీ అరేబియాలోని ఔషధాల పరిశ్రమలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పెట్టుబడిదారులకు ఆయన పిలుపునిచ్చారు.

సౌదీ అరేబియాలో ఇటీవలి సంవత్సరాలలో ఫార్మాస్యూటికల్, వైద్య పరికరాల ఫ్యాక్టరీల సంఖ్య 25% పెరిగిందని, వైద్య పరికరాల ఫ్యాక్టరీలు 54 నుండి 150కి పెరిగాయన్నారు. ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలు 2019 నుండి 2023 వరకు 42 నుండి 56కి పెరిగాయని మంత్రి వివరించారు. వీటి మొత్తం విలువ $10 బిలియన్లకు చేరిందన్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com