‘బఘీరా’ మరో ‘కేజీఎఫ్’ అవుతుందా.?
- October 23, 2024
‘కేజీఎఫ్’, ‘కాంతార’ తదితర సినిమాలతో కన్నడ ఫిలిం ఇండస్ట్రీ ఖ్యాతి పెరిగిందని చెప్పొచ్చు. దాంతో, ఆ తర్వాతి నుంచి కన్నడ సినిమా వస్తుందంటే చాలు క్రేజ్ ఆటోమెటిగ్గా పెరిగిపోతుంది.
అంతేకాదు, ఒకప్పుడు మినిమమ్ బడ్జెట్ సినిమాలుగా వుండేవి. కానీ, ఇప్పుడు బడ్జెట్ స్కేల్ కూడా పెరిగింది. భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయ్.
అలా తాజాగా కన్నడ నుంచి వస్తున్న సినిమానే ‘బఘీరా’. శ్రీ మురళి హీరోగా నటిస్తున్నాడు. ఈయన మరెవరో కాదు, ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి స్వయానా బంధువే.
అంతేకాదు, ఈ సినిమాకి కథ అందించింది కూడా ప్రశాంత్ నీలే. లేటెస్టుగా ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్‌కి రెస్పాన్స్ బాగుంది. విజువలైజేషన్ చూస్తే ‘కేజీఎఫ్’ తరహాలో అనిపిస్తోంది.
యాక్షన్ ఘట్టాలు సూపర్బ్ అనిపిస్తున్నాయ్. టెక్నికల్ టీమ్ వర్క్ బాగుంది. ఇప్పటికే బజ్ బాగా వుంది. ట్రైలర్ తర్వాత మరింత పెరిగింది.
అక్టోబర్ 31కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడాలి మరి, ఈ సూపర్ హీరో మూవీ ఎలాంటి సంచలనాలు నమోదు చేయనుందో.!
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







