సౌదీలో కొత్తగా సముద్ర పర్యావరణ చట్టాలు..10 ఏళ్ల జైలు, SR30 మిలియన్ జరిమానా..!!

- October 23, 2024 , by Maagulf
సౌదీలో కొత్తగా సముద్ర పర్యావరణ చట్టాలు..10 ఏళ్ల జైలు, SR30 మిలియన్ జరిమానా..!!

రియాద్: సౌదీ అరేబియాలో సముద్ర పర్యావరణ చట్టాలకు పదును పెట్టారు. ఇకపై పర్యావరణాన్ని దెబ్బతీసే చర్యలకు పాల్పడితే జైలు శిక్షతోపాటు భారీ జరిమానా విధించబడుతుందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. కొత్త పర్యావరణ చట్టం ప్రకారం, ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష, SR30 మిలియన్ల వరకు జరిమానాలు ఉన్నాయి. సముద్ర ప్రాంతాలు, నీటి వనరులను రక్షించడానికి.. అలాగే సముద్ర ప్రాంతాలను సంరక్షించడానికి ఉద్దేశించిన నిర్దిష్ట నిబంధనలు చట్టంలో ఉన్నాయి.  రసాయనాలు లేదా వ్యర్థాల వల్ల కలిగే కాలుష్యం వంటి వాటిని నీటి వనరులకు హాని కలిగించే పర్యావరణ నేరాల కింద చేర్చారు. నేరం తీవ్రతను బట్టి SR1 మిలియన్ నుండి SR30 మిలియన్ల వరకు జరిమానాలు విధించవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. పర్యావరణాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరి బాధ్యతగా ఉండాలని, చట్టాలను ఉల్లంఘించిన సందర్భంలో వ్యక్తులు, సంస్థలపై జరిమానాలు ఒకే విధంగా విధించబడతాయని హెచ్చరించారు. అయితే, పర్యావరణ పరిరక్షణకు కొత్త చట్టాన్ని తేవడం పట్ల ప్రకృతి ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com