ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు...

- October 23, 2024 , by Maagulf
ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు...

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరిగింది. ఇందులో మంత్రివర్గం కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. విశాఖ శ్రీ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రకు చెందిన శారదాపీఠానికి గత సర్కారు ఇచ్చిన 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలన్న ప్రతిపాదనకు ఆమోదముద్ర పడింది.

ఈ సమావేశంలో ఇసుక సీనరేజ్ రద్దు, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, కొత్త రేషన్ కార్డుల జారీ, కొత్త మద్యం పాలసీ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, గత ప్రభుత్వ భూ కేటాయింపులు వంటి అంశాలపై చర్చించారు.

క్యాబినెట్ నిర్ణయాలు

  • దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చేందుకు ఆమోదం
  • నగదు చెల్లించి సిలిండర్‌ కొనుగోలు చేస్తే 48 గంటల్లో తిరిగి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ
  • ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్‌ ఇవ్వాలని నిర్ణయం
  • ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్‌, జీఎస్టీ ఛార్జీల రద్దుకు ఆమోదం
  • పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు ఆమోదం
  • ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు
  • అందుకు సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు ఆమోదం
  • విశాఖ శారదాపీఠానికి భూ కేటాయింపు రద్దు
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com