బ్రిక్స్‌ సదస్సులో మోదీ ప్రసంగం

- October 23, 2024 , by Maagulf
బ్రిక్స్‌ సదస్సులో మోదీ ప్రసంగం

మాస్కో: భారత్ యుద్ధానికి మద్దతు ఇవ్వదని.. చర్చలు, దౌత్యానికి మాత్రమే మద్దతు ఇస్తుందని బ్రిక్స్ సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రష్యాలో జరుగుతోన్న బ్రిక్స్ సదస్సుకు వచ్చిన దేశాల అధినేతలతో జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడారు.

అన్ని వివాదాలు చర్చలతో పరిష్కృతమవుతాయని మోదీ అన్నారు. రష్యాలోని కెసాన్ నగరంలో బ్రిక్స్ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇచ్చినందుకు, గత ఏడాదిగా కూటమికి నాయకత్వం వహించినందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు కూడా ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం ప్రపంచం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో బ్రిక్స్‌ సమావేశం జరుగుతోందని అన్నారు. ద్రవ్యోల్బణాన్ని నిరోధించడం, ఆహారం, విద్యుత్తు, ఆరోగ్యానికి భరోసా, నీటి భద్రత, ఆన్‌లైన్‌లో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందడం, డీప్‌ఫేక్‌ల వంటి సైబర్ మోసాలు వంటి ప్రపంచంలో కొత్త సవాళ్లు పుట్టుకొచ్చాయని చెప్పారు.

ప్రపంచం ఇన్ని సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ బ్రిక్స్ దేశాల సమూహంపై ప్రపంచానికి అనేక అంచనాలు ఉన్నాయని అన్నారు. బ్రిక్స్‌ అన్ని రంగాలలోనూ సానుకూల పాత్ర పోషించగలదని తాను నమ్ముతున్నానని మోదీ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com