టర్కీ రాజధాని అంకారాలో '26/11' తరహాలో ఉగ్రదాడి! 10 మంది మృతి..
- October 23, 2024
అంకారా: టర్కీ రాజధాని అంకారాలోని ఏవియేషన్ కంపెనీ టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (TUSAS) ప్రధాన కార్యాలయం వెలుపల తీవ్రవాద దాడి జరిగింది. ఆ తర్వాత కూడా అక్కడే ఉన్న ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు.
చాలా మందిని బందీలుగా పట్టుకున్నారు ఉగ్రవాదులు. ఈ దాడిలో 10 మంది మృతి చెందినట్లు వస్తున్నాయి. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రాథమిక దర్యాప్తులో ఈ దాడిని ఆత్మాహుతి బాంబు పేలుడుగా స్థానిక అధికారులు భావిస్తున్నారు. టర్కీ అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ దీనిని ఉగ్రవాద దాడిగా ప్రకటించారు. టర్కీ అంతర్గత మంత్రి అలీ యెర్లికాయ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో ఒక ప్రకటన విడుదల చేశారు. 'టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్‌పై ఉగ్రవాద దాడి జరిగింది. దురదృష్టవశాత్తు, టర్కీ సైనికులు అమరులయ్యారు. చాలా మంది గాయపడ్డారు.' అంటూ అలీ యెర్లికాయ పేర్కొన్నారు.
ఈ దాడి జరిగిన సమయంలో ఆవరణలో ఉన్న ఉద్యోగులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించిన భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే, టర్కీ అధికారులు దీనిని తీవ్రవాద దాడిగా స్పష్టంగా అభివర్ణించినప్పటికీ, ఈ దాడికి ఇంకా ఏ సంస్థ బాధ్యత వహించలేదు.
TUSAS (టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్) ఒక టర్కిష్ రక్షణ, విమానయాన సంస్థ. హైటెక్తో పాటు, ఇది దేశంలోని ఏరోస్పేస్, రక్షణ రంగానికి ప్రధాన సహకారం అందిస్తోంది. ఈ కంపెనీ టర్కీ మొట్టమొదటి జాతీయ యుద్ధ విమానం KAAN ను ఉత్పత్తి చేసింది. TUSAS Türkiye సైనిక అవసరాలను తీర్చడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా విమానయానం, రక్షణ ఉత్పత్తులను కూడా ఎగుమతి చేస్తోంది. దీని నైపుణ్యం యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, UAVలు (డ్రోన్లు), ఉపగ్రహాలను సైతం తయారీ చేస్తుంది.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!