ఫ్లాగ్ డే నుండి యూఏఈ జాతీయ దినోత్సవం.. నెల రోజులపాటు సెలబ్రేషన్స్..!!
- October 24, 2024
యూఏఈ: ఎమిరేట్స్ లో ముఖ్యమైన జాతీయ వేడుకలను జరుపుకోవడానికి దుబాయ్ కొత్త ప్రచారాన్ని ప్రారంభించింది. 16 ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల భాగస్వామ్యంతో ప్రారంభించిన ఈ క్యాంపెయిన్ యూఏఈ ఫ్లాగ్ డే, 53వ ఈద్ అల్ ఎతిహాద్ (యూఏఈ జాతీయ దినోత్సవం) వేడుకలతో సమానంగా ఉంటుంది. నవంబర్ 3న ప్రారంభమయ్యే ఈ ప్రచారం డిసెంబర్ 3 వరకు కొనసాగనుంది. యూఏఈ వ్యవస్థాపక పితామహులు షేక్ జాయెద్ బిన్ సుల్తాన్ అల్ నహ్యాన్ మరియు షేక్ రషీద్ బిన్ సయీద్ అల్ మక్తూమ్లను గౌరవించేందుకే ఈ క్యాంపెయిన్ ను ప్రారంభించినట్లు దుబాయ్ రెండవ డిప్యూటీ రూలర్, దుబాయ్ మీడియా కౌన్సిల్ (డిఎంసి) ఛైర్మన్ షేక్ అహ్మద్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు. .
ఫైర్ వర్క్స్
డిసెంబర్ 2, 3 తేదీలలో జేబీఆర్ బీచ్, అల్ సీఫ్, హట్టా, దుబాయ్ ఫెస్టివల్ సిటీ మాల్ వంటి ప్రదేశాలలో అద్భుతమైన ఫైర్ వర్క్స్ ప్రదర్శనలను చూడవచ్చు.దాంతోపాటు సాంప్రదాయ జానపద నృత్యాలు, సంగీత ప్రదర్శనలను ఆస్వాదించడానికి హట్టాకు వెళ్లవచ్చు. దుబాయ్ గ్లోబల్ విలేజ్‌లో ప్రచారం సందర్భంగా నివాసితులు ప్రతిరోజూ ఫైర్స్ వర్క్స్ చూడవచ్చు.
సీజనల్ మార్కెట్లు
బీచ్ క్యాంటీన్, రైప్ మార్కెట్, వింటర్ వండర్ల్యాండ్తో సహా అనేక సీజనల్ మార్కెట్లు కూడా ఉత్సవాల్లో భాగంగా కానున్నాయి. ఇవి ఎమిరాటీ నేపథ్యాన్ని, స్థానిక ఆహారం, రిటైల్ అనుభవాలను అందిస్తాయి. వటాని అల్ ఎమారత్ సహకారంతో 'యూనియన్ డే పరేడ్' డిసెంబర్ 2న సిటీ వాక్‌లో కూడా నిర్వహించనున్నారు.
మ్యూజియంలు
దుబాయ్ కల్చర్ అండ్ ఆర్ట్స్ అథారిటీ (దుబాయ్ కల్చర్) హట్టా హెరిటేజ్ విలేజ్ వంటి ముఖ్య సాంస్కృతిక గమ్యస్థానాలలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతం గొప్ప చరిత్ర, సంస్కృతిని సందర్శకులు తెలుసుకోవచ్చు. అల్ ఫాహిదీ హిస్టారికల్ నైబర్‌హుడ్ దుబాయ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే విభిన్న కార్యకలాపాలను నిర్వహించనున్నారు. యూఏఈ అతిపెద్ద ఓపెన్-ఎయిర్ హెరిటేజ్ మ్యూజియం అయిన అల్ షిందాఘా మ్యూజియంలో సందర్శకులు సమగ్ర సాంస్కృతిక వైభవాన్ని తెలుసుకోవచ్చు. ఈ మ్యూజియం పాత దుబాయ్‌లోని జీవితంలోని అంశాలను ప్రదర్శించనున్నారు.
ఎక్స్పో సిటీ దుబాయ్
ఎక్స్పో సిటీ దుబాయ్ 53వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకల్లో భాగంగా ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా ‘యూనియన్ సింఫనీ’ పేరుతో సంగీత కచేరీని నిర్వహిస్తుంది. ఆర్కెస్ట్రా రెండు ఉచిత పబ్లిక్ ప్రదర్శనలను ఏర్పాటు చేస్తుంది. ఎక్స్పో సిటీలోని ఐకానిక్ అల్ వాస్ల్ ప్లాజా యూఏఈ జెండాలు, సాంప్రదాయ ఎమిరాటీ డెకర్‌తో అలంకరించారు. అక్కడ సాంప్రదాయ ఎమిరాటీ ప్రదర్శకులు సాంస్కృతిక ప్రదర్శనలను సందర్శకులు ఆస్వాదించవచ్చు. అల్ వాస్ల్ ప్లాజా ఎమిరాటీ హార్వెస్ట్ మార్కెట్‌ను లో లోకల్ వ్యవసాయ, ఆహార ఉత్పత్తులను చూడవచ్చు.
దుబాయ్ ఫ్రేమ్, పార్కులు
దుబాయ్ మునిసిపాలిటీ ఈద్ అల్ ఎతిహాద్ కోసం ప్రధాన పార్కులు, దుబాయ్ ఫ్రేమ్, దుబాయ్ సఫారీ పార్క్, క్లాక్ టవర్ రౌండ్అబౌట్లను మిరుమిట్లు గొలిపే లైట్లతో అకరించనున్నారు.
దుబాయ్ విమానాశ్రయాలు
అధికారిక ఈద్ అల్ ఎతిహాద్ వేడుకల కోసం దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్‌లో ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేయనున్నరు. దుబాయ్ ఎంట్రీ పాయింట్ల వద్దకు వచ్చే సందర్శకులు సాంప్రదాయ జాతీయ పాటలతో స్వాగతం పలుకుతారు. అనేక రకాల ఎమిరాటీ సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయ ప్రదర్శనలు కూడా నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!