ఒమన్-ఉక్రెయిన్ సంబంధాలు బలోపేతం..మస్కట్‌లో ఉక్రేనియన్ ఎంబసీ ప్రారంభం..!!
- October 24, 2024
మస్కట్: మస్కట్‌లో ఉక్రెయిన్ రాయబార కార్యాలయాన్ని..ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ హమద్ అల్ బుసైదీ సమక్షంలో ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సైబిహా ప్రారంభించారు. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడం, వివిధ రంగాలలో ఉమ్మడి సహకారాన్ని విస్తరించడం వంటి ఫ్రేమ్‌వర్క్‌లో రాయబార కార్యాలయం ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. ఒమన్ - ఉక్రెయిన్ మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలను పెంపొందించే దిశగా అడుగులు పడ్డాయని ఉక్రెయిన్ మంత్రి తెలిపారు. వాణిజ్యం, ఇంధనం, వ్యవసాయం వంటి వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడం పట్ల తాము ఆసక్తిగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ వేడుకల్లో పలువురు అధికారులు, అరబ్, ఇతర దేశాల రాయబారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







