కెనడియన్ ట్రెజర్ హంట్.. విమాన టిక్కెట్లు, హోటల్ స్టే గెలవండి..!!
- October 25, 2024
యూఏఈ: యూఏఈ- కెనడా దేశాల మధ్య 50 సంవత్సరాల బంధాన్ని పురస్కరించుకుని యూఏఈలోని కెనడియన్ మిషన్ దేశవ్యాప్తంగా నివాసితుల కోసం ఒక నిధి ట్రెజర్ హంట్ ను నిర్వహిస్తోంది. ఇందులో విమాన టిక్కెట్లు, హోటల్ బస నుండి 11-కోర్సు భోజనం వరకు అనేక బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది.
యూఏఈలోని కెనడా రాయబారి రాధా కృష్ణ పాండే ప్రకారం.. కెనడా సంస్కృతికి దేశంలోని నివాసితులను పరిచయం చేయడమే ఈ ట్రెజర్ హంట్ ఉద్దేశ్యం. ముందుగా వచ్చిన కేవలం 150 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ట్రెజర్ హంట్‌లో పాల్గొనడం ఉచితం. నవంబర్ నెలలో 50 ఛాలెంజ్‌లను పూర్తి చేయడానికి ముందు పాల్గొనేవారు యాప్‌ను డౌన్లోడ్ చేసి, నమోదు చేసుకోవాలి. కెనడియన్ కనెక్షన్‌తో స్మారక చిహ్నాల ముందు సెల్ఫీలు తీసుకోవడం, హాకీ గేమ్‌కు హాజరు కావడం, యూఏఈలో బీవర్, దుప్పిని కనుగొనడం వరకు, పాల్గొనేవారు గెలవడానికి అర్హత సాధించడానికి అనేక ప్రత్యేకమైన సవాళ్లను పూర్తి చేయాలి. ట్రెజర్ హంట్ గురించి మరిన్ని వివరాలను మిషన్ సోషల్ మీడియా ఛానెల్‌లలో చూడవచ్చని వెల్లడించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







