గాజా, లెబనాన్‌లలో యుద్ధం.. ముగింపు కోసం ఖతార్ కృషి..!!

- October 25, 2024 , by Maagulf
గాజా, లెబనాన్‌లలో యుద్ధం.. ముగింపు కోసం ఖతార్ కృషి..!!

దోహా: గాజా, లెబనాన్‌లలో యుద్ధం కారణంగా తలెత్తిన బాధాకరమైన దశను వీలైనంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందని,  అమాయక పౌరుల పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఖతార్ ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి HE షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్రహ్మాన్ బిన్ జాసిమ్ అల్ థానీ కోరారు.  

అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత కొన్ని రోజులుగా గాజాపై ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడులు తీవ్రమవుతున్నాయని అన్నారు. ఉత్తర గాజాపై విధించిన ఆంక్షలు, ఆసుపత్రులు, శరణార్థి శిబిరాలపై బాంబు దాడులు, గాజా స్ట్రిప్‌లోని పాలస్తీనియన్లపై బారెల్ బాంబులు వేయడం వరకు తీవ్రస్థాయికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడానికి  ఖతార్ విధానం కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు.  గాజా, లెబనాన్‌లలో యుద్ధాలను ఆపడానికి.. ఈ ప్రాంతంలో సమగ్ర కాల్పుల విరమణను సాధించడానికి ఖతార్ రాష్ట్రం కృషి చేస్తోందని ఆయన తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com