కిరణ్ అబ్బవరం ‘క’ ట్రైలర్ రిలీజ్..
- October 25, 2024
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న మూవీ ‘క’. సుజీత్, సందీప్ ఇద్దరి దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది. చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మాణంలో రూపుదిద్దుకుంటోంది. నయన్ సారిక, తన్వి రామ్ కథానాయికలు. భారీ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా పాన్ ఇండియా మూవీగా రాబోతుంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్, టీజర్, రెండు పాటలు అలరించాయి. ఇక ఈ మూవీ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ బాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.
కాగా.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ‘క’ సినిమా ట్రైలర్ చూస్తే.. కృష్ణగిరి అనే ఓ ఊళ్ళో ఊరిలో పోస్ట్ మ్యాన్ గా పనిచేస్తుంటాడు అభినయ వాసుదేవ్. అక్కడ ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు వాసుదేవ్. ఉత్తరాలు పంచే క్రమంలో 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమని ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్ ను బెదిరిస్తాడు. ఆ ఉత్తరంలో ఏముంది ?, వాసుదేవ్ ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు బెదిరిస్తున్నారు అని ఆసక్తిగా సినిమా ఉండబోతున్నట్టు, చివర్లో ఓ ట్విస్ట్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మీరు కూడా క ట్రైలర్ చూసేయండి..
తాజా వార్తలు
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం







