నవంబర్ నెలాఖరులోగా దేశంలోనే అత్యుత్తమ స్పోర్ట్స్ పాలసీ
- October 26, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర క్రీడా విధానానికి సంబంధించిన తుది ముసాయిదా నవంబర్ నెలాఖరులోగా సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆయన సూచనల ప్రకారం, ఈ పాలసీ దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలని, విస్తృత అధ్యయనం, నిపుణులు, క్రీడాకారులతో సంప్రదింపులు చేయాలని తెలిపారు.
ముఖ్యమంత్రి తన నివాసంలో నిర్వహించిన సమీక్షలో, రాష్ట్రంలో ఉన్న క్రీడా వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని, స్టేడియాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ చేయాలని సూచించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు త్వరగా రూపొందించాలని ఆదేశించారు.
తెలంగాణ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (YIPESU), యంగ్ ఇండియా స్పోర్ట్స్ అకాడమీ (YISA), స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (SATG) సంబంధించి పలు వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. దక్షిణ కొరియా పర్యటనలో గుర్తించిన అంశాలను కూడా ఈ పాలసీలో చేర్చాలని సూచించారు.
మరో పది రోజుల్లో స్పోర్ట్స్ పాలసీకి సంబంధించిన గవర్నింగ్ బాడీని ఖరారు చేయాలని, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు సంబంధించిన క్యాలెండర్‌ను వెంటనే తయారు చేయాలని సీఎం ఆదేశించారు. వచ్చే రెండేళ్లలో నేషనల్ గేమ్స్‌కు తెలంగాణ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్, ముఖ్యమంత్రి కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్‌లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్‌లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







