'నిర్మల కాన్వెంట్‌'లో కింగ్‌ నాగార్జున అతిథి పాత్రలో

- June 23, 2016 , by Maagulf
'నిర్మల కాన్వెంట్‌'లో కింగ్‌ నాగార్జున అతిథి పాత్రలో

 సినీ నటుడు శ్రీకాంత్‌ తనయుడు రోషన్‌ తొలిచిత్రం 'నిర్మల కాన్వెంట్‌'లో కింగ్‌ నాగార్జున అతిథి పాత్రలో కనిపించనున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో పాట చిత్రీకరణ జరిగింది. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రోషన్‌, శ్రేయ శర్మ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి నాగ కోటేశ్వరరావు దర్శకత్వం వహించారు. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి కుమారుడు రోషన్‌ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. .'వూపిరి' చిత్రం తర్వాత నాగార్జున రెండు నెలల విరామం తీసుకుని నిర్మలా కాన్వెంట్‌ షూటింగ్‌లో పాల్గొన్నారు.ప్రస్తుతం నాగ్‌ రాఘవేంద్రరావు దర్శకత్వం వహించనున్న 'ఓ నమో వెంకటేశాయ' చిత్రంలో కథానాయకుడిగా నటించడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 25న ఈ చిత్రం ప్రారంభంకానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com