మడగాస్కర్‌లో బందిపోట్లు దుశ్చర్య..
- June 23, 2016
మడగాస్కర్‌లో బందిపోట్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. దారిదోపిడి కోసం ఓ వాహనాన్ని అడ్డుకుని.. అందులోని ప్రయాణికులను దారుణంగా చంపేశారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
32 మంది ప్రయాణికులతో టొలియారా నుంచి బెరోరోహా వెళ్తున్న ఓ ప్రైవేట్ టాక్సీని బందిపోట్లు అడ్డుకున్నారు. దీంతో వాహనాన్ని వారి నుంచి తప్పించేందుకు డ్రైవర్ ప్రయత్నించగా.. బందిపోట్లు టాక్సీ టైర్లను తుపాకీతో పేల్చారు. అనంతరం వాహనంలోకి చొరబడి ప్రయాణికులపై కాల్పులు జరిపారు. ప్రయాణికుల్లో 10 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. బందిపోట్ల దాడిలో 31 మంది ప్రాణాలు కోల్పోగా ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు.
అనంతరం ప్రయాణికుల బ్యాగులు, జేబుల నుంచి దాదాపు 2వేల డాలర్ల నగదును దోచుకుని బందిపోట్లు పరారైనట్లు తెలిపారు. ఈ ఘటనకు కొద్ది గంటల ముందు ఓ మిలిటరీ వాహనంపై కూడా బందిపోట్లు దాడిచేసినట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







