మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో బెంగుళూరుకు చెందిన ఓ మోడల్
- June 23, 2016
మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసులో బెంగుళూరుకు చెందిన ఓ మోడల్ అరెస్టయ్యింది. కర్ణాటక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారులు ఆమెను కొద్ది రోజుల క్రితం అదుపులోకి తీసుకున్నట్లు బెంగళూరు పోలీసులు ఈరోజు వెల్లడించారు. అరెస్టయిన మోడల్‌ను దర్శిత్‌మితా గౌడగా గుర్తించారు. ఆమెను మాదకద్రవ్యాలకు సంబంధించిన చట్టం కింద అరెస్ట్ చేశారు. ఎన్‌సీబీ అధికారులు ఆమె ఇంట్లో దాడులు చేసి వంద గ్రాముల కొకైన్, 19 గ్రాముల వీడ్ తదితర డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.దాడుల సమయంలో దర్శిత్‌మితా ఇంట్లో లేదు. ఇంట్లో ఉన్న ఆమె స్నేహితుడిని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.బెంగళూరు సహా కొన్ని ప్రాంతాలకు తాను, దర్శిత్‌మితా ఓ గ్యాంగ్‌తో కలిసి డ్రగ్స్ అక్రమరవాణా చేస్తున్నట్లు అరెస్టయిన వ్యక్తి విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. కళాశాల విద్యార్థులు, తదితర చాలా మందికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు చెప్పాడు. దర్శిత్‌మితా స్వస్థలం కర్ణాటకలోని చిక్‌మగ్‌ళూరు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







