మ్యాచ్‌లో ఘర్షణ.. ముగ్గురు ఫుట్‌బాల్ ఆటగాళ్లకు జైలుశిక్ష, Dh600,000 జరిమానా..!!

- October 30, 2024 , by Maagulf
మ్యాచ్‌లో ఘర్షణ.. ముగ్గురు ఫుట్‌బాల్ ఆటగాళ్లకు జైలుశిక్ష, Dh600,000 జరిమానా..!!

యూఏఈ: అబుదాబిలో అక్టోబర్ 20న జరిగిన మ్యాచ్ సందర్భంగా గ్రౌండ్ లో ఘర్షణకు పాల్పడిన ఈజిప్షియన్ జమాలెక్ క్లబ్‌కు చెందిన ముగ్గురు ఫుట్‌బాల్ ఆటగాళ్లకు ఒక నెల జైలు శిక్ష, ఒక్కొక్కరికి Dh200,000 జరిమానా విధించారు. 

పిరమిడ్స్ క్లబ్‌తో జరిగిన ఈజిప్షియన్ సూపర్ కప్ సెమీ-ఫైనల్‌లో ఒక మ్యాచ్‌లో పబ్లిక్ సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేయడం, అల్లర్లను ప్రేరేపించినందుకు వారిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. జమాలెక్ క్లబ్ అల్ అహ్లీ క్లబ్‌తో పాటు ఈజిప్ట్‌లోని రెండు అత్యంత ప్రజాదరణ పొందిన క్లబ్‌లలో ఒకటి.

ఘటన అనంతరం అక్టోబరు 21న నబిల్ ఎమాద్ డొంఘా, ముస్తఫా షాలబీ, ఫుట్‌బాల్ డైరెక్టర్ అబ్దెల్ వాహెద్ ఎల్ సయ్యద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.  నిందితులపై అభియోగాలు రుజువయ్యాయని కోర్టు తన తీర్పులో పేర్కొంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణలో సీసీ ఫుటేజీ ద్వారా సాక్ష్యాధారాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్లేయర్స్ నిబంధనలను పాటించలేదని, క్రీడా ఈవెంట్‌ను సురక్షితంగా ఉంచడానికి బాధ్యత వహించే ప్రభుత్వ ఉద్యోగులపై అనవరసరంగా దాడికి పాల్పడ్డారని తన తీర్పులో కోర్టు స్పష్టం చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com