మస్కట్ ఆర్ట్ 2024 ప్రారంభం.. మూడు రోజుల ప్రదర్శనలో 1500 కళాఖండాలు..!!

- October 30, 2024 , by Maagulf
మస్కట్ ఆర్ట్ 2024 ప్రారంభం.. మూడు రోజుల ప్రదర్శనలో 1500 కళాఖండాలు..!!

మస్కట్: ఒమన్ కన్వెన్షన్ & ఎగ్జిబిషన్ సెంటర్ (OCEC) భాగస్వామ్యంతో మస్కట్ ఆర్ట్ మూడవ ఎడిషన్‌ను వాణిజ్య, పరిశ్రమల మంత్రి కైస్ బిన్ మహ్మద్ అల్ యూసఫ్ అధికారికంగా ప్రారంభించారు.  మస్కట్ ఆర్ట్ ఈవెంట్ అక్టోబర్ 31 వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుండి ఉదయం 12 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది.

2024 ఎడిషన్‌లో హంగేరీ, ఇరాన్, యెమెన్, పాలస్తీనా, లెబనాన్, ఇండియా, యునైటెడ్ కింగ్‌డమ్, సుడాన్, జర్మనీ  తదితర దేశాల నుండి 250 కంటే ఎక్కువ అంతర్జాతీయ కళాకారులు పాల్గొంటున్నారు. పెయింటింగ్స్ నుండి శిల్పాల వరకు 1500 కళాఖండాలు ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఈ మూడు రోజుల ఆర్ట్ ఫెయిర్ కు 10వేల మంది సందర్శకులు వస్తారని అంచనా. మస్కట్ ఆర్ట్ సమయంలో సందర్శకులు కళాకారులతో నేరుగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.   

ఈ సందర్భంగా సంస్కృతి, క్రీడలు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ బిన్ సుల్తాన్ అల్ బుసైది మాట్లాడుతూ.. వర్క్‌షాప్‌లు, కమ్యూనిటీ కార్యకలాపాల ద్వారా కళల ప్రాముఖ్యతను హైలైట్ చేయడానికి ఈ ఈవెంట్‌ దోహదం చేస్తుందన్నారు. మూడు రోజుల ఈవెంట్‌లో సందర్శకులు వర్క్‌షాప్‌లు, లైవ్ మ్యూజిక్, వినోదాన్ని ఆస్వాదించవచ్చని తెలిపారు. మరింత సమాచారం కోసం, మస్కట్ ఆర్ట్ వెబ్‌సైట్ లేదా Instagram పేజీని చూడాలని కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com