కింగ్ ఛార్లెస్-3 మరియు క్వీన్ కెమిల్లా బెంగళూరులో సీక్రెట్ పర్యటన
- October 30, 2024
బెంగళూరు: కింగ్ ఛార్లెస్-3 మరియు ఆయన సతీమణి క్వీన్ కెమిల్లా అక్టోబర్ 27 నుండి బెంగళూరులో రహస్యంగా సందరిస్తున్నారు. రాజు గా ఆయనకు ఇది నగరానికి సంబంధించిన మొదటి పర్యటన అయినప్పటికీ, ప్రిన్స్ ఆఫ్ వేల్‌గా ఉన్న సమయంలో కింగ్ ఈ నగరాన్ని చాలా సార్లు సందర్శించారు. అందువల్ల బెంగళూరుతో ఆయనకు ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. “గార్డెన్ సిటీ”గా ప్రసిద్ధి చెందిన ఈ నగరానికి ఈ పర్యటన ప్రత్యేకమైన ప్రాధాన్యతను ఇస్తుంది.
ఈ సందర్శన ద్వారా కింగ్ ఛార్లెస్-3 భారతదేశంతో తన సంబంధాలను మరింత బలపరచాలని మరియు పర్యావరణం, సాంస్కృతిక అంశాలను ప్రాధాన్యంగా ఉంచాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రాజ కుటుంబం ఈ సందర్శన కోసం వైట్‌ఫీల్డ్‌లో ఉన్న ప్రసిద్ధ సౌఖ్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ హెల్త్ సెంటర్ (SIHHC)ని ఎంపిక చేసుకుంది. అక్కడ ఆరోగ్య చికిత్సలు మరియు విశ్రాంతి కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయబడ్డాయి.
వారి రాకను ఎలాంటి హడావిడి లేకుండాగా నిర్వహించారు.ఇది రహస్య పర్యటన కావడంతో హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) విమానాశ్రయంలో ఎలాంటి అధికారిక స్వాగతం లేదు. ఈ విమానాశ్రయం సాధారణ విమానయానానికి, కార్పొరేట్ ఫ్లైట్లకు మరియు ప్రత్యేక VIP ప్రయాణాలకు మద్దతు ఇస్తుంది. ఆరోగ్య కేంద్రానికి వారి ప్రయాణానికి సంబంధించి అధికారిక ట్రాఫిక్ నియంత్రణలు లేకపోయాయి.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







