కన్నడ సినీ నటుడు దర్శన్ కు మద్యంతర బెయిల్
- October 30, 2024
బెంగళూరు: కన్నడ సినీ నటుడు దర్శన్కు కర్నాటక హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. దర్శన్కు శస్త్ర చికిత్స జరగాల్సి ఉండటంతో ఆరు వారాల తాత్కాలిక బెయిల్ను న్యాయస్థానం మంజూరు చేసింది. అభిమానిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో దర్శన్ కటకటాలపాలైన సంగతి తెలిసిందే.కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో దర్శన్కు తాత్కాలికంగా ఊరట లభించింది. జస్టిస్ ఎస్.విశ్వజిత్ శెట్టి దర్శన్ కు బెయిల్ మంజూరు చేశారు.
బ్యాక్ పెయిన్ కారణంగా తనకు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని, బెయిల్ మంజూరు చేయాలని దర్శన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారించిన కర్నాటక హైకోర్టు అతని అభ్యర్థనను మన్నించి బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ మంజూరు సందర్భంలో దర్శన్ కు కోర్టు కొన్ని షరతులు పెట్టింది. దర్శన్ తన పాస్పోర్ట్ను సరెండర్ చేసి, తాను కోరుకున్న హాస్పిటల్ లో ఏడు రోజుల లోపు ట్రీట్మెంట్ తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల