అమరావతిలో చంద్రబాబును కలిసిన రామ్‌దేవ్
- October 30, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ కలిశారు. బుధువారం అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం కు చేరుకున్న బాబా..చంద్రబాబు ను కలిశారు. ఈ సమావేశంలో బాబా రామ్‌దేవ్, చంద్రబాబు రాష్ట్రంలో ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడం పై చర్చించారు.
బాబా రామ్‌దేవ్, యోగా గురువు, వ్యాపారవేత్త మరియు పతంజలి ఆయుర్వేద సంస్థ సహ వ్యవస్థాపకుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయుర్వేదం, యోగా, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో రామ్‌దేవ్ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన పతంజలి సంస్థ ద్వారా ఆయుర్వేద ఉత్పత్తులు, సేంద్రీయ ఆహార పదార్థాలు, ఆరోగ్య సంబంధిత ఉత్పత్తులను విస్తరించి, దేశవ్యాప్తంగా ప్రజలకు అందిస్తున్నారు.
తన జీవితంలోని తొలినాళ్ల నుంచి యోగా మరియు ఆరోగ్యకర జీవన విధానంపై దృష్టి పెట్టిన రామ్‌దేవ్, అనేక యోగా శిబిరాలు నిర్వహించి, ప్రజలకు యోగా నేర్పడంలో ముందుంటారు. ఆయుర్వేదం, యోగా ప్రయోజనాలను ప్రోత్సహిస్తూ, ఆయన ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం లక్షల మందిని ప్రేరేపించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల