యూఏఈ వీసా క్షమాభిక్ష పథకం..మరో రెండు నెలలు పొడిగింపు..!
- November 01, 2024
యూఏఈ: రెండు నెలల పాటు యూఏఈ వీసా అమ్నెస్టీ ప్రోగ్రామ్ను పొడిగిస్తున్నట్లు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) ప్రకటించింది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ పథకం, డిసెంబర్ 31తో ముగుస్తుంది. వేలాది మంది నివాసితులు తమ వీసా స్టేటస్ని క్రమబద్ధీకరించుకోవడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఐసిపి డైరెక్టర్ జనరల్ మేజర్-జనరల్ సుహైల్ సయీద్ అల్ ఖైలీ మాట్లాడుతూ.. యూఏఈ 53వ యూనియన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని క్షమాభిక్ష గడువును పొడిగించే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ముందుగా నిర్ణయించిన తుది గడువు అక్టోబరు 31కి ముందు దరఖాస్తుదారుల సంఖ్య పెరిగినట్లు అల్ ఖైలీ తెలిపారు. ఈ క్రమంలో మరో రెండు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. తుడి గడువు ముగిసాక చట్టాలు ఉల్లంఘించిన వారిపై ICP తనిఖీలు తీవ్రతరం చేస్తుందన్నారు. ఓవర్స్టేయర్లు యూఏఈలోని ఏదైనా ICP కేంద్రాలు, అలాగే ఆమోదించబడిన టైపింగ్ సెంటర్లు, ఆన్లైన్ ఛానెల్లలో దరఖాస్తు చేసుకోవచ్చని ICP తెలిపింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







