సౌదీ-భారత్ మధ్య పవర్ గ్రిడ్.. సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి ఒప్పందం..!
- November 01, 2024
రియాద్: సౌదీ-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి ఆధ్వర్యంలోని ఆర్థిక, పెట్టుబడి కమిటీ రెండవ మంత్రివర్గ సమావేశం రియాద్‌లో జరిగింది. ఈ సమావేశానికి సౌదీ ఎనర్జీ మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్, భారత వాణిజ్యం పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ , గోయల్.. సౌదీ నేషనల్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిషన్ కంపెనీ, సెంట్రల్ ట్రాన్స్మిషన్ యుటిలిటీ ఆఫ్ ఇండియా మధ్య రెండు దేశాల మధ్య ఎలక్ట్రికల్ ఇంటర్‌కనెక్ట్ యొక్క సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి కుదిరిన ఒక ఒప్పందంపై సంతకం చేశారు. ఇది రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని పెంచుతుందని ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, సాంకేతికత, వ్యవసాయం, ఆహార భద్రత, వాతావరణ శాస్త్రం, సుస్థిర రవాణా, వాహనాల ఆర్థిక పనితీరు మెరుగుదల, ప్రజా రవాణా బస్సు వ్యవస్థలు, పట్టణ చైతన్యాన్ని పెంపొందించడం వంటి రంగాల్లో ఉమ్మడి గ్రూపుల పురోగతిపై సమావేశంలో చర్చించారు. లాజిస్టిక్స్ సేవలు, వైర్లెస్ కమ్యూనికేషన్స్, సుస్థిర వ్యవసాయం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ గవర్నెన్స్‌లో సహకారం, వ్యవసాయ ఉత్పత్తుల భద్రతను నిర్ధారించే మార్గాలపై అధ్యయనం చేయాలని కూడా సమావేశంలో నిర్ణయించినట్లు అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల