దుబాయ్ డ్యూటీ ఫ్రీ మాజీ చీఫ్ కోల్మ్ మెక్లౌగ్లిన్ కన్నుమూత
- November 01, 2024
దుబాయ్: దుబాయ్ డ్యూటీ ఫ్రీ (DDF) ప్రారంభానికి నాయకత్వం వహించిన కోల్మ్ మెక్లౌగ్లిన్(81) బుధవారం యూకేలో మరణించారు. మెక్లౌగ్లిన్ 1983లో కొత్త డ్యూటీ ఫ్రీ ఆపరేషన్‌ను ప్రారంభించేందుకు దుబాయ్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఐరిష్ ఎయిర్పోర్ట్ అథారిటీ అయిన ఏర్ రియాంటా కన్సల్టెన్సీ బృందంలో సభ్యుడిగా ఉన్నారు. ట్రావెల్ రిటైల్ పరిశ్రమలో 55 ఏళ్ల తర్వాత డిడిఎఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్మన్, సిఇఒగా ఈ ఏడాది మేలో పదవీ విరమణ చేశారు.
దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ (DXB) గురువారం ఒక ట్వీట్లో సంతాపం తెలిపింది. మెక్లౌగ్లిన్ను "ట్రావెల్ రిటైల్ కమ్యూనిటీలో ఒక విశిష్ట నాయకుడు, ప్రియమైన వ్యక్తి"గా అభివర్ణించింది. Flydubai CEO ఘైత్ అల్ ఘైత్ మాట్లాడుతూ..కాల్మ్ మరణ వార్త బాధించిందని తెలిపారు. అతను గత నాలుగు దశాబ్దాలుగా దుబాయ్ డ్యూటీ ఫ్రీకి అందించిన విశేషమైన సహకారం ట్రావెల్ రిటైల్ ల్యాండ్‌స్కేప్‌ను మార్చిందన్నారు. ప్రస్తుతం DDFలో 55 వివిధ దేశాలకు చెందిన 5,700 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. గత సంవత్సరం Dh7.8 బిలియన్ల అమ్మకాలు చేసింది. దాదాపు 21.5 మిలియన్ లావాదేవీలతో 55 మిలియన్ల వస్తువులను విక్రయించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







