రెడ్ ప్యాలెస్‌కి పునర్ వైభవం.. జాతీయ సెలవుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు..!!

- November 01, 2024 , by Maagulf
రెడ్ ప్యాలెస్‌కి పునర్ వైభవం.. జాతీయ సెలవుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు..!!

కువైట్: జహ్రాలోని చారిత్రాత్మక రెడ్ ప్యాలెస్‌కు పునర్ వైభవాన్ని తెచ్చేందుకు కువైట్ మునిసిపాలిటీ యోచిస్తోందని ప్రాజెక్ట్ డైరెక్టర్ రావన్ అల్-ధఫిరి తెలిపారు. కువైట్‌కు గొప్ప చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ ప్యాలెస్.. కువైట్ నేషనల్ కౌన్సిల్ ఫర్ కల్చర్, ఆర్ట్స్ అండ్ లెటర్స్ పర్యవేక్షణలో నిపుణుల బృందంచే పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగుతున్నాయని తిపారు. ఈ ప్యాలెస్ అల్-జహ్రాను రక్షించడానికి 1897లో నిర్మించారు. 1920లో జహ్రా యుద్ధానికి ఇది సాక్ష్యంగా నిలిచింది.

ఫిబ్రవరి 2025లో కువైట్ జాతీయ సెలవుల కోసం రెడ్ ప్యాలెస్‌లో ప్రత్యేక కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు. కువైట్ మునిసిపాలిటీ ఉత్తరాన ప్యాలెస్‌కు ఆనుకుని 470,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పార్క్, హెరిటేజ్ మార్కెట్‌ను రూపొందించాలని యోచిస్తోందని ధఫిరి చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌లో పిల్లల కోసం ప్రత్యేక స్థలాలతో పాటు చిన్న మధ్య తరహా పరిశ్రమలు, చారిత్రక గ్రంథాలయం, బహిరంగ థియేటర్, వర్క్‌షాప్‌లు, బూత్‌లు కూడా ఉంటాయన్నారు. ఇప్పటికే ప్రాజెక్ట్ దక్షిణ భాగం సౌక్ అల్-ముబారకియాను గుర్తుకు తెచ్చే హెరిటేజ్ మార్కెట్‌ను నిర్వహిస్తున్నారు. వీటితోపాటు బంగారు మార్కెట్, ఖర్జూరాల మార్కెట్, బట్టల మార్కెట్‌తో పాటు ఈవెంట్‌ల కోసం పెద్ద వేదికతో సహా కువైట్ వారసత్వాన్ని ప్రతిబింబించే డిజైన్‌లు ఉంటాయని పేర్కొన్నారు. రెడ్ ప్యాలెస్ విలేజ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ రంగం భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడుతుందని, ప్రాజెక్ట్ కోసం ప్రీ-క్వాలిఫికేషన్ ప్రక్రియ నవంబర్ 26 వరకు కొనసాగుతుందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com