న్యూ సలాలా ఎయిర్పోర్ట్ రూఫ్ లీకేజీ
- June 23, 2016
ఒమని మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మరియు కమ్యూనికేషన్స్, సలాహ్ ఎయిర్పోర్ట్ భారీ వర్షాల కారణంగా నీటితో నిండిపోయిదని, దోహార్ ప్రావిన్స్‌లో కురిసిన వర్షాలతో ఈ పరిస్థితి ఏర్పడిందని పేర్కొంది. ఇంకో వైపున సోషల్ మీడియాలో ఎయిర్పోర్ట్ సీలింగ్ నుంచి నీరు లీక్ అవుతూ, టెర్మినల్‌లోకి పెద్దయెత్తున నీరు చేరుతున్నట్లుగా కొన్ని ఫొటోలు వైరల్ అయ్యాయి. దాంతో మినిస్ట్రీ వెంటనే రంగంలోకి దిగింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. అయితే ఇంకా ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ గ్యారంటీలో ఉందనీ, ఎలాంటి నష్టం జరిగినా అది కాంట్రాక్టర్ బాధ్యత అవుతుందని చెప్పారు. 2015 నవంబర్‌లో ఈ ఎయిర్పోర్ట్ అధికారికంగా ష్ట్రప్రారంభమయ్యింది. జూన్ 15న ఆపరేషన్స్ ప్రారంభమయ్యాయి. స్టేట్ ఆఫ్ ఆర్ట్ సౌకర్యాలతో, ప్రపంచంలోనే అత్యాధునిక ఎయిర్‌పోర్ట్‌గా దీన్ని తీర్చిదిద్దారు. 53000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ప్యాసింజర్ టెర్మినల్ ఏర్పాటయ్యింది. ఎ380 వంటి అతి భారీ విమానాలకు సేవలందించేందుకు వీలుగా నిర్మితమైంది ఈ ఎయిర్పోర్ట్. పార్కింగ్ ఏరియాలో వివిఐపి మరియు ట్యాక్సీ పార్కింగ్ లాట్స్తో మొత్తం 2200 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం ఉందిక్కడ.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









