సౌదీ అరేబియాలో టాక్సీ ఛార్జీల సమీక్షకు కొత్త విధానం..!!
- November 03, 2024
రియాద్: అప్లికేషన్ల ద్వారా టాక్సీ ఛార్జీలను సమీక్షించడానికి సౌదీ అరేబియా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇది ట్రాన్స్‌పోర్ట్ జనరల్ అథారిటీ (TGA) లేదా ఫెసిలిటీ ఆపరేటింగ్ ట్రాన్స్‌పోర్ట్ అప్లికేషన్‌ల ద్వారా ప్రతిపాదించారు. సౌదీలో ప్రజా రవాణాను ఉపయోగించడం కోసం ఛార్జీలను నిర్ణయించే విధానంలోని ఆరవ అధ్యాయంలోని 30వ పేరాను సవరించాలని రవాణా, లాజిస్టిక్స్ మంత్రి సలేహ్ అల్-జాసర్ ఉత్తర్వులు జారీ చేశారు.
కొత్త సవరణల ప్రకారం.. ట్రాన్స్‌పోర్ట్ జనరల్ అథారిటీ ప్రతిపాదించిన ఛార్జీలను ఆమోదించడానికి “సమీక్ష - ఆమోదం” ఆధారంగా ఒక పద్దతి అభివృద్ధి చేశారు. ఎలక్ట్రానిక్ అప్లికేషన్ల ద్వారా టాక్సీ సర్వీస్ ఛార్జీలను నిర్ణయించడానికి ఇదే విధమైన మెకానిజంను కలిగి ఉంది. లైసెన్స్ పొందినవారు, టాక్సీ యాక్టివిటీలో లైసెన్స్ ఉన్నవారు, అలాగే ఎలక్ట్రానిక్ అప్లికేషన్‌లను నిర్వహిస్తున్న సంస్థలు ఆమోదించబడిన ఛార్జీలను అనుసరించడం, వాటిని అప్‌డేట్ చేసినప్పుడు వాటిని లబ్ధిదారులకు అందజేయడం తప్పనిసరి అని అథారిటీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల