బహ్రెయిన్ లో రుణాలు చెల్లించని ప్రవాసులపై ప్రయాణ నిషేధం..!!
- November 03, 2024
మనామా: బహ్రెయిన్ లో రుణాలు చెల్లించని ప్రవాసులపై ప్రయాణ నిషేధం విధించనున్నారు. ఈమేరకు నిబంధనలను సమీక్షించడానికి న్యాయమూర్తుల ప్యానెల్‌ను ఏర్పాటు చేసేందుకు న్యాయ వ్యవహారాల కమిటీ ఆమోదించింది. వచ్చే మంగళవారం చర్చకు రానుంది. 2021 డిక్రీ నెం. 22 ప్రకారం జారీ చేయబడిన సివిల్, కమర్షియల్ విషయాలలో ఎగ్జిక్యూషన్ చట్టంలోని ఆర్టికల్ 40ని అప్‌డేట్ చేయాలని ఎంపీ డాక్టర్ మర్యమ్ అల్ ధాన్ ప్రతిపాదన చేశారు. ఇది ఆమోదం పొందినట్లయితే, ముగ్గురు న్యాయమూర్తుల ప్యానెల్‌ను ఏర్పాటు చేస్తారు. కొంతమంది తమ అప్పులను పక్కదారి పట్టించడానికి ఉపయోగించే చట్టంలోని అంతరాలను మూసివేయడం ఈ ప్రణాళిక లక్ష్యం అని చెప్పారు. కాగా, యూఏఈలో బహిష్కరణకు గురైన రుణగ్రస్తులు బయలుదేరే ముందు వారి బకాయిలను క్లియర్ చేయాల్సి ఉంటుంది. బహ్రెయిన్ ప్రతిపాదన విదేశీ రుణగ్రస్తులు చెల్లించకుండా వదిలివేసే అవకాశాన్ని తగ్గించడం ద్వారా రుణదాతలను రక్షించే లక్ష్యంతో చర్యలు చేపట్టనున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల