దుబాయ్ లో రోడ్డు ప్రమాద మరణాల నివారణకు ప్రత్యేక చర్యలు..!!
- November 03, 2024
యూఏఈ: రోజువారీ రవాణాను సురక్షితంగా..అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి దుబాయ్ నిరంతరం కృషి చేస్తుంది. ఎమిరేట్ తరచుగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేస్తుంది. భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించిన వారిపై భారీ జరిమానాలు విధిస్తుంది. ఇటీవల, ఎమిరేట్ కొత్త ట్రాఫిక్ చట్టాన్ని కూడా ఆమోదించింది. ఇది 14 వేర్వేరు ఉల్లంఘనలకు జరిమానాలను వివరించింది. వాటిలో కొన్ని జైవాకింగ్‌కు భారీ జరిమానాలు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫోన్‌లను ఉపయోగించడం, ఆకస్మిక రోడ్ క్రాస్ చేయడం వంటివి చేస్తే వాహనాలను 30-రోజులపాటు సీజ్ చేస్తామని కమాండర్-ఇన్-చీఫ్, లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి వెల్లడించారు. రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించే లక్ష్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వంటి తాజా స్మార్ట్ టెక్‌ని ఉపయోగించి నిర్ణయం తీసుకుంటున్నారు.
సెప్టెంబరులో, షార్జా పోలీసులు గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2024 మొదటి అర్ధ భాగంలో 100,000 మంది నివాసితులకు 15 శాతం, దీనితో పాటు ప్రతి 10,000 వాహనాలకు 9 శాతం ట్రాఫిక్ ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని అల్ మర్రీ తెలిపారు. ఇదిలా ఉండగా, అక్టోబర్ ప్రారంభంలో, మెట్రోలో ఇ-స్కూటర్ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ప్రకటించడంపై నివాసితులు సంతోషించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







