కార్లలో వరుస చోరీలు.. ముసుగు దొంగ అరెస్ట్..!!
- November 04, 2024
యూఏఈ: వాహనాల్లోని వస్తువులను దొంగిలిస్తున్న ముసుగు ధరించిన దొంగను రస్ అల్ ఖైమా పోలీసులు అరెస్టు చేశారు. అనుమానితుడికి ముప్పై ఏళ్లు ఉంటాయని, వాహనాల అద్దాలు పగలగొట్టి అనేక చోరీలు చేసినట్లు విచారణలో తేలిందని పోలీసు ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ తారిఖ్ మహ్మద్ బిన్ సైఫ్ తెలిపారు. ఎమిరేట్‌లోని వివిధ ప్రదేశాలలో వాహన దొంగతనాలకు సంబంధించి లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు అనేక ఫిర్యాదులు అందాయని, దొంగ తన గుర్తింపును దాచడానికి ముసుగు ధరించి కారు అద్దాలను పగులగొట్టి వస్తువులను దొంగిలించేవాడని వివరించారు. చోరీలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయినట్లు తెలిపారు. వీడియోల ద్వారా కీలక ఆధారాలను సేకరించిన స్పెషల్ టీమ్, నిందితుడిని అదుపులోకి తీసుకుందన్నారు. తదుపరి చట్టపరమైన చర్యల కోసం అతన్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌కు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల