తప్పుడు మాదక ద్రవ్యాల కేసు.. 9 మంది అరెస్ట్..!!
- November 05, 2024
కువైట్: డ్రగ్ కంట్రోల్ కోసం జనరల్ అడ్మినిస్ట్రేషన్ లోని క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్.. నివాసిపై తప్పుడు మాదకద్రవ్యాల స్వాధీనం ఆరోపణ వివరాలను బయట పెట్టిందని చేసిందని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సదరు నివాసి మాజీ భార్య, ఒక అధికారి, అంతర్గత మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు సైనిక సిబ్బందితో సహా అనేక మంది వ్యక్తులు కలిసి కుట్ర చేసి తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేయించారని వెల్లడించారు. ఒక అధికారి, ఇద్దరు పెట్రోలింగ్ అధికారుల సహాయంతో నివాసి వాహనంలో గుర్తించిన డ్రగ్స్‌ను రహస్యంగా, అతనికి తెలియకుండానే పెట్టినట్లు యాంటీ నార్కోటిక్స్ అధికారుల పరిశోధనలో వెల్లదైందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రతి నిందితుడు నేరంలో తమ పాత్రను అంగీకరించారని, తదుపరి చట్టపరమైన చర్యలు మరియు దర్యాప్తు పూర్తి కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేసినట్టు పేర్కొంది.
తాజా వార్తలు
- మనీలాండరింగ్ కేసు..ఇంటర్‌పోల్ రెడ్ నోటీసుతో UAEలో అంతర్జాతీయ ముఠా నాయకుడి అరెస్ట్
- షార్జాలో మహిళ మృతి.. నేరపూరిత ఘటనకు ఆధారాలు లేవన్న పోలీసులు
- విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ‘సిటీ’ సరికొత్త సేవలకు శ్రీకారం
- సౌదీలో డ్రోన్‌ను అడ్డుకునే క్రమంలో శకలాలు పడి ఒకరి మృతి
- మచిలీపట్నంలో ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు..
- షేక్ జాయెద్ గ్రాండ్ మసీద్ సందర్శనకు కొత్త ప్రవేశ రుసుము
- మహనీయుల పోరాటాలు యువతకు స్ఫూర్తిదాయకం: ఉపరాష్ట్రపతి
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!







