యాంటీ కార్ థెఫ్ట్ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రారంభించిన RAK పోలీసులు

- November 05, 2024 , by Maagulf
యాంటీ కార్ థెఫ్ట్ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రారంభించిన RAK పోలీసులు

రస్ అల్ ఖైమా: రస్ అల్ ఖైమా (RAK ) పోలీస్ జనరల్ కమాండ్ వారు క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ తో కలిసి ప్రజలకు తమ విలువైన వస్తువులను మరియు వాహనాలు దొంగతనం నుండి ఎలా రక్షించుకోవాలో అవగాహన కల్పించే లక్ష్యంతో ఒక కొత్త భద్రతా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించారు. 

దొంగతనం నుండి తమ వాహనాలు మరియు విలువైన వస్తువులను ఎలా రక్షించుకోవాలో తెలియజేసేలా "మీ వాహనం మరియు విలువైన ఆస్తులను దొంగతనం నుండి రక్షించండి" అనే నినాదాన్ని కలిగి ఉన్న కారు ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారం ద్వారా రస్ అల్ ఖైమా పోలీస్లు ప్రజలకు వివిధ రకాల భద్రతా చిట్కాలు మరియు జాగ్రత్తలు తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా, వాహనాలను పార్క్ చేసే సమయంలో ఎల్లప్పుడూ తాళం వేసి ఉంచాలని సూచిస్తున్నారు. అలాగే విలువైన వస్తువులను వాహనంలో కనిపించే ప్రదేశాల్లో ఉంచకూడదని సూచిస్తున్నారు. వీటితోపాటు వాహనాల భద్రత కోసం అధునాతన సాంకేతిక పరికరాలను ఉపయోగించడం, అలారమ్ సిస్టమ్స్ మరియు జీపిఎస్ ట్రాకింగ్ వంటి పద్ధతులను అమలు చేయడం ద్వారా వాహనాల చోరీని అరికట్టవచ్చని తెలియజేస్తున్నారు.
ఈ ప్రచారం ద్వారా ప్రజలు తమ భద్రతపై మరింత అవగాహన కలిగి, దొంగతనాలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రస్ అల్ ఖైమా పోలీసులు ప్రజలను కోరుతున్నారు.

--వేణు పెరుమాళ్ల(మాగల్ఫ్ ప్రతినిధి)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com