హైదరాబాద్ లో రాహుల్ గాంధీ..

- November 05, 2024 , by Maagulf
హైదరాబాద్ లో రాహుల్ గాంధీ..

హైదరాబాద్: కాంగ్రెస్ అగ్ర నేత నేత రాహుల్ గాంధీ కొద్ది సేప‌టి క్రితం హైద‌రాబాద్ చేరుకున్నారు.. మ‌హారాష్ట్ర నుంచి ఆయ‌న విమానంలో బేగంపేట‌కు వ‌చ్చారు.. విమానాశ్ర‌యంలో ఆయ‌న‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ స్వాగ‌తం ప‌లికారు. అక్క‌డి నుంచి ఆయ‌న బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్ కు కారులో చేరుకున్నారు. ఇక బుధవారం నుంచి రాష్ట్రంలో చేపట్టనున్న కులగణనపై నేడు మేధావులు, ప్రజలు, వివిధ సామాజిక వర్గాలతో సమావేశం కానున్నారు. వారి నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నారు.

బోయిన్ పల్లిలోని గాంధీ ఐడియాలాజీ సెంటర్ లో జరిగే ఈ స‌మావేశంలో రాహుల్ గాంధీతో మాట్లాడేందుకు 400మందికి అవకాశం ఇచ్చారు. ఇందులో 200మంది పార్టీలోని వివిధ స్థాయి నేతలు ఉన్నారు. 200 మందిలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వివిధ రాష్ట్రస్థాయి కార్పొరేషన్ ఛైర్మన్లు, డీసీసీ అధ్యక్షులు ఉన్నారు. మిగతా 200మందిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారితో పాటు రిటైర్డ్ జడ్జిలు, ప్రొఫెసర్లు, కవులు, కళాకారులు, మేధావులు ఉంటారని పీసీసీ ప్రకటించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com