నవంబర్ 14 నుంచి ఒమన్ లో అరబ్ లైబ్రరీ సమావేశాలు..!!

- November 07, 2024 , by Maagulf
నవంబర్ 14 నుంచి ఒమన్ లో అరబ్ లైబ్రరీ సమావేశాలు..!!

మస్కట్: ఒమన్ సంస్కృతి, క్రీడల మంత్రిత్వ శాఖ.. సుల్తాన్ కబూస్ విశ్వవిద్యాలయం సహకారంతో 35వ అరబ్ ఫెడరేషన్ ఫర్ లైబ్రరీస్ అండ్ ఇన్ఫర్మేషన్ (AFLI) సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది. నవంబర్ 12 నుండి 14 వరకు ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అరబ్ వ్యాప్తంగా ఉన్న ఒమానీ నిపుణులు పాల్గొంటున్నారు. డిజిటల్ గుర్తింపును ప్రోత్సహించడంలో అరబ్ లైబ్రరీల పాత్ర అనే అంశంపై వక్తలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో వర్క్‌షాప్‌లు, చర్చా ప్యానెల్లు నిర్వహించనున్నారు. నిపుణులు తమ అనుభవాలు, ఆవిష్కరణల గురించిన విషయాలను పంచుకోనున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com