యూకేతో బహ్రెయిన్ సైనిక బంధం..ప్రాంతీయ భద్రతపై కీలక చర్చలు..!!
- November 07, 2024
మానామా: బహ్రెయిన్-యూకే మధ్య సైనిక బంధం మరింత బలోపేతం కానుంది. ఇందులో భాగంగా హెచ్‌హెచ్ స్టాఫ్ కమాండర్ షేక్ ఇసా బిన్ సల్మాన్ బిన్ హమద్ అల్ ఖలీఫా యూకే నావల్ చీఫ్ అడ్మిరల్ సర్ బెన్ కీతో బ్రిటిష్ రాయల్ నేవీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు. బహ్రెయిన్ -యునైటెడ్ కింగ్డమ్ మధ్య సైనికచ, రక్షణ రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచడానికి కొనసాగుతున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ కీలక సమావేశం జరిగిందని అధికార యంత్రాంగం తెలిపింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల వృద్ధికి ఈ భేటీ జరిగిందన్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో భద్రత కొనసాగించడంలో రెండు దేశాలు కలిసి పనిచేయాలని ఆకాంక్షించాయి. సైనిక సహకారాన్ని మరింత పెంచడానికి, ప్రాంతీయంగా నెలకొన్న తాజా పరిణామాలను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇరువురు చర్చించారు. రక్షణ, ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవటానికి కలిసి పనిచేయాలని సూత్రప్రాయంగా అంగీకరించారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







