వడ్డీ రేట్లను తగ్గించిన యూఏఈ సెంట్రల్ బ్యాంక్..!!

- November 08, 2024 , by Maagulf
వడ్డీ రేట్లను తగ్గించిన యూఏఈ సెంట్రల్ బ్యాంక్..!!

యూఏఈ: యూఏఈ సెంట్రల్ బ్యాంక్ అమెరికా బాటలో ప్రయాణిస్తుంది. వడ్డీ రేట్లను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త వడ్డీ రేట్లు నవంబర్ 8 నుండి అమలులోకి వచ్చాయి. ఓవర్‌నైట్ డిపాజిట్ సదుపాయానికి (ODF) వర్తించే బేస్ రేటును 4.90% నుండి 4.65%కి 25 బేసిస్ పాయింట్లు తగ్గించాలని సెంట్రల్ బ్యాంక్ నిర్ణయించింది. యూఎస్ రేట్లను పావు శాతం తగ్గించాలని ఫెడరల్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాన్ని అనుసరించి ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.   యూఏఈ సెంట్రల్ బ్యాంక్ కీలక రుణ రేటును 4.50 శాతం, 4.75 శాతం మధ్య తగ్గించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com