వచ్చే బోర్డు మీటింగ్‌లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటాం: టీటీడీ ఛైర్మన్
- November 08, 2024
తిరుమల: టీటీడీ నూతన ఛైర్మన్ గా బీఆర్ నాయుడు బాధ్యతలు స్వీకరించారు. తనకు ఆ బాధ్యత అప్పగించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు బీఆర్ నాయుడు. వచ్చే బోర్డు మీటింగ్ లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటామని ఆయన తెలిపారు. సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళి కొన్ని మార్పులు చెయ్యాల్సి ఉందన్నారు. సవాళ్లు ఉన్నాయని, అన్నింటిని అధిగమిస్తామన్నారు. శ్రీవారి ఆలయ ప్రతిష్ఠ ఎలా కాపాడుకోవాలి అనే దానిపై దృష్టి పెడతామన్నారు బీఆర్ నాయుడు.
ఉద్యోగాల నియామకాలపై అధ్యయనం చేస్తామన్నారు. శ్రీవాణిపై ప్రజల్లో అపోహ ఉందన్న బీఆర్ నాయుడు.. విజిలెన్స్ విచారణ జరుగుతోందని, సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. టీటీడీలో ప్రక్షాళన జరిగింది కాబట్టే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయని టీటీడీ నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. టీటీడీ నూతన ఛైర్మన్ గా బీఆర్ నాయుడు ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు 16 మంది పాలక మండలి సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం అనంతరం బీఆర్ నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
”బోర్డు లేకపోయినా బ్రహ్మోత్సవాలను చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సలహాలు మేరకు ఈ కార్యక్రమాలన్నీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకి, అధికారులకు నూతన బోర్డు తరుపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. శ్రీవారి ఆలయ పవిత్రతను కాపాడుతూ, ప్రతిష్టను పెంచేలా చర్యలు చేపడతాం. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరిస్తాం” అని బీఆర్ నాయుడు తెలిపారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







