క్యాపిటల్ చట్టం ఉల్లంఘన.. SR3.95 మిలియన్ ఫైన్.. 6నెలల జైలుశిక్ష..!!
- November 08, 2024
రియాద్: క్యాపిటల్ మార్కెట్ చట్టంలోని వివిధ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఒక కంపెనీకి చెందిన ముగ్గురు ఉద్యోగులకు SR 3.95 మిలియన్ల జరిమానా, వారిలో ఒకరికి ఆరు నెలల జైలు శిక్షను క్యాపిటల్ మార్కెట్ అథారిటీ (CMA) విధించింది. క్యాపిటల్ మార్కెట్ చట్టం మరియు కంపెనీల చట్టంలోని వివిధ నిబంధనలను ఉల్లంఘించినందుకు అబ్దుల్లా A. M. అల్-ఖోదారీ సన్స్ కో.కి చెందిన ముగ్గురు ఉద్యోగులను CMA కింద అప్పీల్ కమిటీ ఫర్ ది రిజల్యూషన్ ఆఫ్ సెక్యూరిటీస్ డిస్ప్యూట్స్ (ACRSD) దోషులుగా నిర్ధారించింది. ACRSD ప్రకారం.. కంపెనీలో ఆర్థిక శాఖ డైరెక్టర్ సొహైల్ సయీద్ మహ్మద్ సయీద్, కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కైలాష్ నాథ్ సదాంగి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫవాజ్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్మోహసేన్ అల్ఖోదారీలను దోషులుగా నిర్ధారిస్తూ తుది తీర్పు వెలువరించింది. 2010-17 మధ్య కంపెనీ చేపట్టిన నాలుగు ప్రాజెక్టుల్లో భారీగా అవకతవకలు జరిగాయని, ఆదాయాన్ని పెంచి చూపారని అభియోగాలను నమోదు చేశారు. ప్రాజెక్ట్ పూర్తి కావడానికిపెట్టిన ఖర్చులు, కంపెనీ రికార్డుల్లో నమోదు చేసిన వాస్తవ వ్యయాలకు భిన్నంగా ఉన్నాయని విచారణలో గుర్తించారు. ఇందులోకీలక పాత్ర పోషించిన ఫవాజ్ బిన్ అబ్దుల్లా బిన్ అబ్దుల్మోహ్సేన్ అల్ఖుదారికి ఆరు నెలల జైలు శిక్ష విధించారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







