వాహనదారులు అలెర్ట్.. పోలీసు కెమెరాల నిఘాలో దుబాయ్ రోడ్లు..!!

- November 09, 2024 , by Maagulf
వాహనదారులు అలెర్ట్.. పోలీసు కెమెరాల నిఘాలో దుబాయ్ రోడ్లు..!!

దుబాయ్: రోడ్ల పై దుబాయ్ పోలీసుల స్మార్ట్ కెమెరాలతో నిఘా పెట్టింది. ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘనలనైనా గుర్తిస్తాయని అధికార యంత్రాంగం హెచ్చరించింది.  కెమెరాల పనితీరుకు సంబంధించి రెండు ఉదంతాలను వెల్లడించింది. ఒక మహిళా వాహనదారుడు ఒకటి కాదు రెండు ఫోన్‌లను వినియోగిస్తూ కెమెరాలకు చిక్కాడు.  మరొక డ్రైవర్ న్యూస్ పేపర్ చదువుతూ దొరికిపోయాడు.  ట్రాఫిక్ వ్యవస్థల ఉల్లంఘనలను సరికొత్త సాంకేతికతలతో అమర్చని కెమెరాలు తేలికగా క్యాప్చర్ చేస్తాయని జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు.  డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడం, టైల్‌గేటింగ్ వంటి ట్రాఫిక్ నేరాలకు వాహనాలను 30 రోజుల వరకు స్వాధీనం చేసుకుంటామని అల్ మజ్రోయి వాహనదారులకు గుర్తు చేశారు. ఈ నేరాలకు Dh 4000,  Dh1,000 మధ్య జరిమానాలతోపాటు నాలుగు బ్లాక్ పాయింట్లను విధిస్తామని హెచ్చరించారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com