రియాద్ సీజన్.. సందర్శకుల కోసం 'వండర్ గార్డెన్' ప్రారంభం..!!
- November 09, 2024
రియాద్: రియాద్ సీజన్లో అత్యంత ప్రజాదరణ పొందిన, ఆసక్తిగా ఎదురుచూస్తున్న జోన్లలో ఒకటైన వండర్ గార్డెన్ జోన్ ఓపెన్ అయింది. జోన్ అన్ని వయసుల వారికి అనువైన అద్భుతమైన అనుభవాలు, గేమ్లను అందిస్తుంది. వండర్ గార్డెన్ మూడు విభిన్న విభాగాలను కలిగి ఉంది. ప్లవర్స్, రంగులచే ప్రేరేపించబడిన కళాత్మక శిల్పాలను కలిగి ఉన్న ఫ్లోరా జోన్, సందర్శకులను బబుల్ గార్డెన్ లను సందర్శకులు ఆస్వాదించవచ్చు. బటర్ఫ్లై గార్డెన్ జోన్ బటర్ఫ్లై హౌస్ అనుభవాన్ని అందిస్తుంది. ఇందులో వివిధ జాతులకు చెందిన 1,000 కంటే ఎక్కువ సీతాకోకచిలుకలు ఉన్నాయి. జంగిల్ అడ్వెంచర్ జోన్ విభిన్న చెట్ల చుట్టూ ఉన్న ప్రకృతి నుండి ప్రేరణ పొందింది. "డార్క్ గార్డెన్" ను అన్వేషించడానికి సందర్శకులను ఆహ్వానిస్తుంది. దీంతోపాటు జోన్లో "వండర్ గార్డెన్" ఫాంటసీ క్యారెక్టర్, సంగీత ప్రదర్శనలు, కుటుంబంలోని సభ్యులందరికీ అనువైన ఇంటరాక్టివ్ థియేట్రికల్ ప్రదర్శనలతో కూడిన అనేక రోమింగ్ షోలు ఉన్నాయి. వారంలో ఏడు రోజులపాటు సాయంత్రం 4 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల వరకు జోన్ సందర్శకులకు తెరిచి ఉంటుంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







