షార్జా మునిసిపాలిటీ పార్కింగ్ పాసులకు పెరుగుతున్న డిమాండ్..!!
- November 09, 2024
యూఏఈ: షార్జా మునిసిపాలిటీ నవంబర్ 1 నుండి బ్లూ జోన్ పార్కింగ్ సమయాలను పొడించించిన తర్వాత నివాసితులు నెలవారీ పార్కింగ్ సబ్‌స్క్రిప్షన్‌లను పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొత్త పార్కింగ్ నియమాల ప్రకారం..వాహనదారులు ఉదయం 8 నుండి అర్ధరాత్రి వరకు పార్కింగ్ కోసం చెల్లించవలసి ఉంటుంది.గతంలో ఇది గంటల 8 నుండి రాత్రి 10 గంటల వరకు ఉండేది. ఇటీవల షార్జా మునిసిపాలిటీ యొక్క నెలవారీ పార్కింగ్ ప్యాకేజీని పొడిగించిన కారణంగా సబ్‌స్క్రైబ్ చేసుకున్నట్టు షార్జాలోని జమాల్ అబ్దుల్ నాజర్ రోడ్‌లో నివాసముంటున్న అమర్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. "మా ఇంట్లో రెండు కార్లు ఉన్నాయి. మా భవనంలో ఒక ప్రత్యేక పార్కింగ్ స్థలం మాత్రమే ఉంది. కాబట్టి మేము మా రెండవ కారు కోసం మునిసిపాలిటీ యొక్క బ్లూ జోన్లలో పార్కింగ్ కోసం ఎల్లప్పుడూ చెల్లించాల్సి ఉంటుంది." అని అబ్దుల్ అజీజ్ చెప్పారు. గతంలో అబ్దుల్ అజీజ్ దుబాయ్‌లో పని నుండి రాత్రి 8 గంటలకు తిరిగి వచ్చిన తర్వాత తన కారును పార్క్ చేసేవాడు. ప్రతిరోజూ రెండు గంటల పార్కింగ్ కోసం Dh5 చెల్లించి, వారాంతపు విహారయాత్రలతో సహా నెలవారీ Dh150 వరకు చెల్లించాల్సి ఉంటుందని తెలిపాడు. తాజా పొడిగించిన గంటలతో మొత్తం పార్కింగ్ ధర Dh200కి పెరిగిందన్నారు. కాబట్టి తాను మునిసిపాలిటీ నెలవారీ పార్కింగ్‌కు సభ్యత్వాన్ని పొందాలని నిర్ణయించుకున్నట్టు తెలిపాడు. దీనికి అన్ని రుసుములతో కలిపి Dh190 ఖర్చవుతుందని అజీజ్ పేర్కొన్నాడు. అదే బాటలో అనేక మంది నెలవారీ సభ్యత్వాన్ని పొందేందుకు ఆసక్తిచూపుతున్నారు. గతంలో ప్రైవేట్ పార్కింగ్‌కు సభ్యత్వాన్ని పొందిన వారు ఇప్పుడు దీనిని పొందేందుకు ఆసక్తి చూపుతున్నట్లు మునిసిపల్ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







