ఖతార్ బోట్ షో..20వేల సందర్శకులు వచ్చే అవకాశం..!!

- November 10, 2024 , by Maagulf
ఖతార్ బోట్ షో..20వేల సందర్శకులు వచ్చే అవకాశం..!!

దోహా: ఖతార్ బోట్ షోకు 20వేల సందర్శకులు వచ్చే అవకాశం ఉందని ఓల్డ్ దోహా పోర్ట్ సీఈఓ, ఖతార్ బోట్ షో 2024 కోసం ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్, మహమ్మద్ అబ్దుల్లా అల్ ముల్లా తెలిపారు. మెరైన్ సర్వీసెస్, ఇండస్ట్రీ సెక్టార్‌లో విస్తృత శ్రేణి ఒప్పందాలను కుదుర్చుకోవడానికి  ఈ ప్రదర్శనను ఒక ముఖ్యమైన వేదికగా ఉంటుందని పేర్కొన్నాడు.  ఈ ప్రదర్శనలో 11 దేశాల నుండి 75 కంపెనీలు పల్గొంటున్నాయని, 100 సముద్ర నౌకల ప్రదర్శనకు ఉన్నాయని పేర్కొన్నారు.  ఖతార్ సముద్ర పరిశ్రమను  బలోపేతం చేయడానికి ఎగ్జిబిషన్ సహాయపడుతుందని అతను తెలిపాడు. ఖతార్ బోట్ షో ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడానికి, ఖతార్‌ను ప్రపంచ సముద్ర పర్యాటక గమ్యస్థానంగా చేస్తుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com