షుగర్, కొలెస్ట్రాల్ కంట్రోల్ కావాలంటే ఈ పండును తీసుకోవాలి
- November 11, 2024
చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెడుతున్న సమస్య షుగర్. సరిలేని లైఫ్‌స్టైల్, వర్కౌట్ చేయకపోవడం, శరీరానికి ఎలాంటి ఎక్సర్‌సైజ్ చేయలేకపోవడం వల్ల చిన్న వయసులోనే ఈ సమస్య రావడానికి ముఖ్య కారణాలు. అయితే, సమస్య ముదిరితే ఇతర అవయవాలపై ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఈ నేపథ్యంలోనే గుండెపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి, షుగర్‌ని కంట్రోల్ చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని ఫుడ్స్ హెల్ప్ చేస్తాయి. అందులో పాషన్ ఫ్రూట్ ఒకటి.
షుగర్ ఉన్నవారికి అన్ని పండ్లు మంచివి కావు. కానీ, పాషన్ ఫ్రూట్స్ అలా కాదు. ఈ పండు ఎంతో రుచిగా ఉంటుంది. అదే విధంగా, ఈ పండు షుగర్ ఉన్నవారికి మంచి ఔషధంలా కూడా పనిచేస్తుంది. పండు మాత్రమే కాదు. ఆకులు, రెమ్మలు కషాయంగా తీసుకోవచ్చు. ఇందుకోసం ఆకులు చిన్నవైతే 5 తీసుకోవచ్చు. పెద్ద ఆకులు అయితే 3 వాడుకోవచ్చు. ఇది చేయడం కూడా ఈజీ. ఓ లీటర్ నీటిని తీసుకుని అందులో శుభ్రంగా కడిగిన ఆకులు వేయాలి. దీనిని సిమ్‌లో పెట్టి మరిగించాలి. ఈ నీటిని మూడు భాగాలు చేసి.. ఓ భాగం ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. రెండోవది మధ్యాహ్న భోజనం తర్వాత, రాత్రి భోజనానికి ఓ గంట ముందు ఇలా మూడుసార్లు తాగాలి.
ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ 30. ఇది తక్కువ. దీనిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయి పెరుగుదల రేటు తక్కువగా ఉంటుంది. అందుకే, షుగర్ ఉన్నవారు తక్కువగా తినడం మంచిది. ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు కూడా తగ్గుతాయి. ఇందులో శరీరానికి కావాల్సిన పొటాషియం, మెగ్నీషియం, కెరోటినాయిడ్స్, పాలీఫెనాల్స్ అన్నీ ఉంటాయి. ఇవి షుగర్ ఉన్నవారికి మంచివి.
పాషన్ పండులో పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి గుండెకి చాలా మేలు చేస్తాయి. ఈ పండు తినడం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా చేస్తాయి. ఇందులోని పిసెటానాల్, స్కిర్పుసిన్ బి అనే సమ్మేళనం గుండె జబ్బుల్ని తగ్గిస్తుంది. రక్తప్రసరణని మెరుగ్గా చేస్తుంది.కొలెస్ట్రాల్ ఉన్నవారికి కూడా ఔషధంగా మంచిది. దీనికోసం ఆకులతో తయారు చేసిన కషాయంలో నిమ్మరసం కలిపి తాగితే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ పండు, ఆకులతో తయారైన నీటిని తాగితే రక్తనాళాలను క్లీన్ చేస్తుంది. విటమిన్ ఎ ఈ నీరు తాగితే కళ్ళు, చర్మానికి చాలా మంచిది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!