భారత్‌లో 10కి చెేరనున్న 'ట్రంప్' టవర్స్
- November 12, 2024
న్యూ ఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ భారత్‌లో తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించేందుకు సిద్ధమయ్యారు.హైదరాబాద్, నోయిడా, బెంగళూరు సహా మొత్తం ఆరు నగరాల్లో 'ట్రంప్' బ్రాండ్ కింద లగ్జరీ ప్రాజెక్టులను నిర్మించనున్నారు.ముంబయి కేంద్రంగా ఉన్న ట్రైబెకా డెవలపర్స్‌తో కలిసి ఈ నిర్మాణాలను చేపట్టనున్నారు.దీంతో అమెరికా బయట అత్యధికంగా ట్రంప్ టవర్లు ఉన్న దేశంగా భారత్ నిలవనుంది.
హైదరాబాద్, బెంగళూరులోనూ ట్రంప్ టవర్స్
ట్రైబెకా డెవలపర్స్‌తో కలిసి ఎనిమిది మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు ప్రాజెక్ట్‌లను నిర్మించనుంది ట్రంప్ సంస్థ. వీటి అమ్మకాల విలువ రూ.15,000 కోట్ల కంటే ఎక్కువే. కాగా, ఇప్పటికే భారత్‌లోని ముంబయి, కోల్‌కతా, గురుగ్రామ్, పుణె వంటి నాలుగు నగరాల్లో ట్రంప్ టవర్స్ ఉన్నాయి. తాజాగా నోయిడా, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, గురుగ్రామ్, పుణెలో టవర్స్ నిర్మిస్తామని ప్రకటించింది. దీంతో భారత్‌లో ట్రంప్ టవర్ల సంఖ్య 10కి చేరనుంది.
నివాస, వాణిజ్య సముదాయాలు
ట్రంప్ టవర్స్‌లో నివాస, వాణిజ్య సముదాయాలు ఉంటాయని ట్రైబెకా డెవలపర్స్ వ్యవస్థాపకుడు కల్పేశ్ మోహతా తెలిపారు. అలాగే గోల్ఫ్ కోర్టులు, విల్లాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. "నోయిడా, హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, గురుగ్రామ్, పుణె వంటి నగరాల్లో వ్యాపారాన్ని విస్తరించనున్నాం. 'ట్రంప్ వరల్డ్ టవర్స్' పేరిట నిర్మాణాలు ఉంటాయి. అలాగే మొట్టమొదటిసారిగా ట్రంప్ కంపెనీ వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ప్రాజెక్టులో భాగంగా పుణెలో పెద్ద ఆఫీసును కట్టనుంది. ప్రతి ప్రాజెక్ట్‌లో స్థానిక డెవలపర్లు, భూ యజమానులు భాగస్వాములుగా ఉంటారు. ట్రంప్ టవర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏకైక సూపర్ లగ్జరీ రియల్ ఎస్టేట్ బ్రాండ్" అని మెహతా పేర్కొన్నారు.
ప్రారంభానికి ట్రంప్ జూనియర్ వచ్చే అవకాశం!
ట్రంప్ సంస్థ డిసెంబరులో నాలుగు ప్రాజెక్టులను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే 2025 ప్రారంభంలో వీటిని ప్రారంభించనున్నట్లు సమాచారం.ఈ కార్యక్రమానికి డొనాల్డ్ ట్రంప్ జూనియర్ ఎరిక్ ట్రంప్ రానున్నట్లు తెలుస్తోంది.కాగా, ఇప్పటికే ముంబయి, పుణె, గురుగ్రామ్, కోల్‌కతాలో ఉన్న ట్రంప్ టవర్స్ ధనికులను ఆకర్షించాయి. బాలీవుడ్ తారలు సైతం విలాసవంతమైన భవనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే ట్రంప్ టవర్స్ లో 20శాతం ఎన్నారైలే కొనుగోలు చేశారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







