ఉద్యోగాల పేరుతో మోసాలతో.. నిందితులుగా మారుతున్న బాధితులు..?

- November 12, 2024 , by Maagulf
ఉద్యోగాల పేరుతో మోసాలతో.. నిందితులుగా మారుతున్న బాధితులు..?

యూఏఈ: మోసపూరిత ఉద్యోగ రిక్రూటర్ల చేతిలో మోసపోయిన బాధితుడు క్రిమినల్ గా మారే అవకాశం ఉంటుందని  సైబర్ క్రైమ్ ఉన్నతాధికారి ఒకరు హెచ్చరించారు. క్రిప్టో స్కామ్‌లు, నకిలీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లు, నకిలీ ఇ-సేవలు, బోగస్ రియల్ ఎస్టేట్ అవకాశాలు ఇటీవల పెరుగుతున్నాయని అబుదాబి పోలీస్ సైబర్ క్రైమ్ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ అలీ అల్ నుయిమి అన్నారు. బాధితులను మోసం చేయడానికి వ్యక్తులను నియమించుకున్న అనేక భోగస్ కంపెనీలపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మోసపూరిత కార్యకలాపాలు చేస్తూ పోలీసులకు పట్టుబడినప్పుడు మాత్రమే దొంగతనానికి అనుబంధంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

లెఫ్టినెంట్ కల్నల్ అలీ అల్ నుయిమి మాట్లాడుతూ.. "ఇటువంటి కేసులు ఇటీవల పెరుగుతున్నాయి.  కార్యకలాపాలు తరచుగా అంతర్జాతీయంగా ఊహాజనిత పెట్టుబడి వాలెట్లను నిర్వహించే వ్యవస్థీకృత నేర సమూహాలచే నిర్వహించబడతాయి. వారు అధిక వేతనంతో కూడిన రిమోట్ ఉద్యోగాలను అందిస్తామని నమ్మబలుకుతారని, అక్కడి ఉద్యోగి కస్టమర్లను ఆన్‌లైన్ క్రిప్టో ప్లాట్‌ఫారమ్‌లలో పెట్టుబడి పెట్టాలని కోరుతూ మొత్తంలో కొంత శాతాన్ని కమీషన్‌గా తీసుకుంటారు." అని తెలిపారు. మొదటి బాధితుడు - ఉద్యోగి, రెండవ బాధితుడు అని, క్లయింట్ నుండి మొత్తాన్ని తీసుకుంటాడని.. ఫ్రాడ్ జరుగుతున్నట్లు తెలియకపోయినా బాధితుడే నిందితుడిగా మిగిలే అవకాశం ఉంది.అటువంటి సందర్భాలలో స్కామ్ ఆర్కెస్ట్రేటర్లు దోచుకున్న డబ్బును స్వాధీనం చేసుకుని, వారిపై అభియోగాలు నమోదు చేస్తామని తెలిపారు. ప్రజలు పూర్తిగా ఆన్‌లైన్‌లో జాబ్ ఆఫర్‌ను నమ్మవద్దని లెఫ్టినెంట్ కల్నల్ అల్ నుయిమి కోరారు.  ఖాతాలను స్తంభింపజేయడానికి మీ బ్యాంకుకు కాల్ చేయాలని, వీలైనంత త్వరగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని లెఫ్టినెంట్ కల్నల్ అల్ నుయిమి కోరారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com