ఈద్ అల్ ఎతిహాద్ పేరుతో యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకలు..!!

- November 13, 2024 , by Maagulf
ఈద్ అల్ ఎతిహాద్ పేరుతో యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకలు..!!

యూఏఈ: యూఏఈ జాతీయ దినోత్సవ వేడుకలకు అధికారికంగా 'ఈద్ అల్ ఎతిహాద్' అని నామకరణం చేసినట్టు నిర్వాహక కమిటీ ప్రకటించింది. 'యూనియన్' (ఎతిహాద్) థీమ్‌తో డిసెంబర్ 2, 1971న ఎమిరేట్స్ ఏకీకరణను పురస్కరించుకుని వేడుకలను జరుపుకోనున్నారు.  ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న, యూఏఈ ఒక గొప్ప ప్రదర్శనను నిర్వహిస్తుంది. దీనికి సాధారణంగా ఎమిరేట్స్ పాలకులు హాజరవుతారు. ఈ ఏడాది షో ఎక్కడ ఉంటుందనేది ఇంకా వెల్లడించలేదు. అయితే ఆ రోజు ఏడు ఎమిరేట్స్‌లోని 'ఈద్ అల్ ఎతిహాద్ జోన్‌లలో' మల్టీ యాక్టివేషన్‌లు ఉంటాయని కమిటీ తెలిపింది.  

జాతీయ దినోత్సవ సందర్భంగా డిసెంబర్ 2, 3 వరుసగా సోమవారం, మంగళవారం సెలవులు ప్రకటించారు. శనివారం-ఆదివారం వారాంతంతో కలిపితే, అది నాలుగు రోజుల సెలవు అవుతుందని 53వ ఈద్ అల్ ఎతిహాద్ సెలబ్రేషన్ ఆర్గనైజింగ్ కమిటీ వ్యూహాత్మక, సృజనాత్మక వ్యవహారాల డైరెక్టర్ ఈసా అల్సుబౌసి తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com