న్యూఢిల్లీలో సౌదీ, భారత విదేశాంగ మంత్రుల కమిటీ సమావేశం
- November 14, 2024
న్యూఢిల్లీ: సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, భారత విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్ న్యూఢిల్లీలో రాజకీయ, భద్రత, సామాజిక, సాంస్కృతిక సహకారంపై మంత్రివర్గ కమిటీ రెండవ సమావేశానికి అధ్యక్షత వహించారు. సౌదీ-భారత వ్యూహాత్మక భాగస్వామ్య మండలి కింద మంత్రివర్గ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రిన్స్ ఫైసల్, డాక్టర్ జైశంకర్‌తో అధికారిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడం, వివిధ రంగాల్లో సహకారం, సహకారాన్ని మరింత అభివృద్ధి చేసుకునే మార్గాలపై చర్చించారు. ఇద్దరు మంత్రులు ఉమ్మడి ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.
క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్, భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని సౌదీ-భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి కొత్త సహకార శకానికి నాంది పలికిందని ప్రిన్స్ ఫైసల్ సమావేశంలో ప్రసంగించారు. ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు కౌన్సిల్ తన ప్రభావాన్ని మరింత బలోపేతం చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయ, కాన్సులర్, రక్షణ, సైనిక, న్యాయ, భద్రత, సామాజిక, సాంస్కృతిక వ్యవహారాల్లో సహకారాన్ని పెంపొందించుకోవాలన్న సమావేశ మినిట్స్ పై ప్రిన్స్ ఫైసల్, జైశంకర్ సంతకాలు చేశారు. ఈ సమావేశంలో రెండు దేశాలు ముఖ్య నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







