ట్రేడింగ్ స్కామ్..734,000 దిర్హామ్‌లను కోల్పోయిన అబుదాబి నివాసి..!!
- November 14, 2024
యూఏఈ: ఒక అబుదాబి నివాసి ఐదు సంవత్సరాల క్రితం నకిలీ ట్రేడింగ్ వెబ్సైట్లో ఖాతా తెరిచిన తర్వాత బోగస్ పెట్టుబడులలో దాదాపు $200,000 (Dh734,000) కోల్పోయింది. దాంతో అన్నింటికి దూరంగా ఉన్నా, ఇప్పటికీ స్కామర్లు బెడద మాత్రం తగ్గడం లేదని వాపోయింది. ఇటీవల తనకు ఫోన్ చేసి, తన ఖాతా మరొక వెబ్‌సైట్‌కి మార్చామని, దానిని మళ్లీ యాక్టివేట్ చేసుకోవాలని చెబుతున్నారని తెలిపారు. జూన్ 2019లో ufx.com అనే ఆన్లైన్ ట్రేడింగ్ వెబ్సైట్ ఫేస్బుక్ ప్రకటనను చూసి కాల్ చేయడంతో స్కామర్ల వలలో పడినట్టు గుర్తుచేశారు. అధిక లాభాలను ఇప్పిస్తామని నమ్మించి విడదల వారీగా సొమ్మును డిపాజిట్ చేయించుకున్నారని అని జోర్డానియన్ IT మేనేజర్ చెప్పారు.
ప్రారంభంలో రోజుకు $2,000 వరకు లాభాలను ఇచ్చారని, అనంతరం $50,000 డిపాజిట్ చేయగా, మార్కెట్ నష్టాలను తెచ్చిపెట్టింది. సగం మొత్తాన్ని కోల్పోయిన తర్వాత, మహిళ UFXలో తన ఒప్పందాలను ముగించి, తన ఖాతా నుండి మిగిలిన నగదును ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకుంది. కానీ, వారు ఖాతాను కొనసాగించాలని, లైఫ్ టైమ్ సెటిల్ మెంట్ చేస్తామని, అందుకు అవసరమైన Dh300,000 విలువైన మూడు సంవత్సరాల రుణం కోసం దరఖాస్తు చేయించారని తెలిపారు. నా డాక్యుమెంట్స్ తీసుకొని, లోన్ అమౌంట్ తోపాటు తాను జమ చేసిన మొత్తాన్ని కోల్పోయినట్టు, ఎన్ని సార్లు ఫోన్ చేసిన వారు స్పందించలేదని బాధితురాలు వివరించారు.
"ఏమైనప్పటికీ నాకు నగదు రాలేదు. కానీ నెలవారీ రుణ చెల్లింపులు నా జీతంలో మూడవ వంతుకు చేరాయి. " అని ఆమె చెప్పింది. 2020లో కోవిడ్-19 వ్యాప్తి తర్వాత తాను పనిలో బిజీగా ఉన్నానని, ఇది నష్టాల గురించి ఆలోచించకుండా ఉండటానికి నాకు సహాయపడింది." అని తెలిపారు. అయినప్పటికీ, UFX ఖాతాలు అమనా అనే మరొక ప్లాట్‌ఫారమ్‌కు బదిలీ అయ్యాయని పేర్కొంటూ ఇటీవల వరకు బోగస్ ఏజెంట్లు కాల్ చేస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. నూర్ క్యాపిటల్ అనే వెబ్సైట్ కింద వాలెట్‌ను మళ్లీ యాక్టివేట్ చేయడానికి యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌ను కూడా వారు షేర్ చేశారని, అది బోగస్ అని తాను వెంటనే గుర్తించానని ఆ మహిళ తెలిపింది. "స్కామర్ల బెడద కొనసాగుతుంది. వారు కొత్త పేర్లతో తమ మాటల గారడితో నా లాంటి బాధితులను మోసం చేస్తూనే ఉన్నారు." అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అబుదాబి పోలీస్ సైబర్ సెక్యూరిటీ హెడ్ లెఫ్టినెంట్ కల్నల్ అలీ అల్ నుయిమి మాట్లాడుతూ.. ఇ-నకిలీలు వినియోగదారులను ఒక వెబ్సైట్ నుండి మరొక వెబ్‌సైట్‌కి పంపడం సర్వసాధారణమని, స్కామర్లు ప్రముఖ కార్పొరేట్ల పేర్లు, లోగోలను కాపీ చేస్తారని, తద్వారా ప్రజలకు తెలియకుండానే బాధితులను మోసం చేస్తారని తెలిపారు. “మొదట మీరు గెలుస్తున్నారని వారు మీకు చూపుతారు. పెట్టుబడి పెట్టడానికి వారికి మరింత ఎక్కువ డబ్బు పంపేలా మిమ్మల్ని ఒప్పిస్తారు. ఆన్లైన్ మోసం ఎప్పటికీ ఆగదు. పాత, కొత్తగా చర్యలను అనుసరించి ఇది అభివృద్ధి చెందుతుంది. ”అని లెఫ్టినెంట్ కల్నల్ అలీ అల్ నుయిమి హెచ్చరించారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







